Rice Cultivation : పొడి విధానంలో వరి సాగు.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులు

ఇటీవల కాలంలో కొంత మంది రైతులు పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్‌ సీడర్‌తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు .

Rice Cultivation : పొడి విధానంలో వరి సాగు.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులు

Cultivation of rice

Rice Cultivation : అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారుపోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలంటున్నారు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లా రైతుల చేత వరిని పొడిపద్ధతిలో సాగుచేయిస్తూ.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులను పొందేలా ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్ సంస్థ. ఇందుకోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఫర్టిలైజర్ కం సీడ్ డ్రిల్ ను సబ్సిడీ కింద అందిస్తున్నారు.

READ ALSO : Paddy Cultivation : వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వలన వరి నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది.

READ ALSO : Shade Net :షేడ్ నెట్ కింద ప్రోట్రేలలో నారు పెంపకం

ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా కొరవడుతున్నాయి. వీటితోపాటు కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇటీవల కాలంలో కొంత మంది రైతులు పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్‌ సీడర్‌తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు .

READ ALSO : Pests In Sugarcane Plantations : లేత చెరకుతోటల్లో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ పద్ధతిలో 20 శాతం నీరు ఆదా అవుతుంది. 10 రోజులు ముందుగానే పంటకోతకు వస్తుంది. పంట దిగుబడి కూడా 15శాతం పెరుగుతుంది. అందుకే శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ పౌండేషన్.. రైతుల చేత పొడిపద్ధతిలో వరిసాగును గత రెండేళ్లుగా చేయిస్తోంది. ఇందుకోసం రైతులకు పొడి వరిసాగుపట్ల అవగాహన కల్పించడమే కాకుండా..  ఫర్టిలైజర్ కం సీడ్ డ్రిల్ ను సబ్సిడీ కింద అందిస్తున్నారు.