Ukrainians freezing Sperm : రష్యాపై యుద్ధానికి ముందు స్పెర్మ్‌ భద్రపరిచిన యుక్రెయిన్ సైనికులు..భర్త దూరమైనా తల్లి కానున్న వీర సైనికుడి భార్య..

దేశాల మధ్య యుద్ధం.. సౌథాలను కూల్చి శిథిలాలను మిగులుస్తుంది. కానీ తమ సంతాన కలల సౌథాలు కూలిపోకూడదనుకన్నారు యుక్రెయిన్ సైనికులు.అందుకే రష్యాతో చేసే యుద్ధంలో తాము చనిపోయినా తమ సంతాన కలలు నెరవేరాలనుకున్నారు.అందుకే తమ వీర్యాన్ని భద్రపరిచారు.

Ukrainians freezing Sperm : రష్యాపై యుద్ధానికి ముందు స్పెర్మ్‌ భద్రపరిచిన యుక్రెయిన్ సైనికులు..భర్త దూరమైనా తల్లి కానున్న వీర సైనికుడి భార్య..

Ukrainians freezing their sperm

Ukrainians freezing their sperm : దేశాల మధ్య యుద్ధం.. నష్టాన్నే మిగులుస్తుంది విజయాన్ని కాదు..ఈ ఒక్క మాట ఏదేశమైనా గ్రహిస్తే అసలు యుద్ధమనే మాట రాదు కదా..ప్రాణం విలువ తెలిస్తే యుద్ధం అనే ఊసే ఉండదు కదా..యుద్ధం సౌథాలను కూల్చి శిథిలాలను మిగులుస్తుంది. యుద్ధం ప్రాణాలను తీసి మారణహోమం గుర్తుల్ని మాత్రమే మిగులుస్తుంది. యుద్ధం ప్రజల పండంటి కలల్ని కూల్చేస్తుంది. సౌధాలలను తిరిగి నిర్మించుకోవచ్చు. కానీ కూలిన కలల్ని తిరిగి నిర్మించుకోలేదు.అటువంటిదే రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతోంది. ఏడాదిన్నరగా మారణహోమాన్ని రగులుస్తునే ఉంది. బిడ్డకు తండ్రి..తండ్రికి కొడుకు లేకుండాపోయారు. మాతృదేశం వదిలి పరాయి పంచన బతుకులు వెళ్లదీస్తున్నారు.

ఏడాదిన్నగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మిలియన్ల కోట్లు నష్టం. కూలిన సౌధాలు..శ్మశానాలను తలపిస్తున్న యుక్రెయిన్ దేశం. అందాలు చిందే ఆ దేశం మరుభూమిగా మారిపోయింది. ప్రాణాలకు తెగించి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కలిగిన రష్యాతో పోరాటానికి యుద్ధభూమిలో దిగారు యుక్రెయిన్ సైనికులు.అశేషమైన రష్యా సేనముంద యుక్రెయిన్ సైన్యం చాలా చాలా తక్కువే.అయిన తమ దేశం కోసం కదనరంగంలోకి దిగారు యుక్రెయిన్ సేన..

Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా దళాల లైంగిక వేధింపులు…మొబైల్ జస్టిస్ టీం నివేదిక వెల్లడి

ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు యుక్రెయిన్ సైనికులు చేసిన ఓ గొప్ప పని ఇటీవలే బయటకొచ్చింది. తమ వీర్యాన్ని (sperm)భద్రపరిచారట..యుక్రెయిన్ సైనికులు యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి ముందే చేసిన ఓ పని గురించి ఇప్పుడు బయటకు తెలిసింది.

ఇటీవల యుక్రెయిన్ సైనికుడు ఒకరు రష్యా దాడిలో వీరమరణం పొందాడు. అలా యుద్ధానికి వెళ్లే ముందే అతను ఊహించాడు. బహుశా తాను తిరిగి వస్తానో లేదోనని. యుద్ధం అంటే అంతేమరి. యుద్ధానికి వెళ్లే ముందే తన వీర్యాన్ని ఫ్రీజర్ లో భద్రపరిచాడు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోతే తమ సంతాన కలలు చెదిరిపోకూడదన్నది నటాలియా కిర్కాచ్-ఆంటోనెంకో దంపతులు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం తెలిసి రోమాలు నిక్కబొడుకుంటున్నాయి. తమ దేశం కోసం ప్రాణం పోయినా పరవాలేదు.సంతాన కలలు దేశం కోసం కావాలనుకున్నారా సైనిక దంపతులు. కానీ రష్యా దాడిలో తన భర్త వీర మరణం పొందినా..ఆ వీర సైనికుడి భార్య తల్లి కానుంది.

సదరు వీర సైనికుడి భార్య సోషల్ మీడియాలో అందరికీ ఓ పిలుపును కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలంటూ దంపతులు అందరికీ సూచించింది. ఇదొక్కటే మీకు మిగిలి ఉన్న చాన్స్ అంటూ పేర్కొంది. కాగా చాలామంది యుక్రెయిన్ సైనికులు తమ వీర్యాలను ఫ్రీజర్ లో భద్రపరిచి యుద్ధానికి వెళ్లారని తెలిసింది.

నిజానికి ఉక్రెయిన్ ను సంతాన పరిశ్రమకు కేంద్రంగా చెప్పుకోవాలి. ఉక్రెయిన్ మహిళలు సరోగసీ కోసం పెద్ద ఎత్తున ముందుకు వస్తుంటారు. దీంతో అక్కడ ఈ పరిశ్రమ పెద్ద స్థాయిలోనే కొనసాగేది. రష్యా యుద్ధంతో ఇది మొత్తం కుదేలైపోయింది. విదేశీయులు సరోగసీ కోసం యుక్రెయిన్ కు వస్తుంటారు. యుక్రెయిన్ లోనే అతిపెద్ద ఫెర్టిలిటీ క్లినిక్ సైతం ఉచితంగా వీర్య కణాలు, అండాల నిల్వకు అవకాశం కల్పిస్తోంది. సైన్యంలో పనిచేసే స్త్రీ, పురుషులను ఈ దిశగా ప్రోత్సహిస్తోంది. గర్భధారణ చికిత్సల్లోనూ రాయితీలిస్తోంది.

 

,