Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా దళాల లైంగిక వేధింపులు…మొబైల్ జస్టిస్ టీం నివేదిక వెల్లడి

Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా దళాల లైంగిక వేధింపులు…మొబైల్ జస్టిస్ టీం నివేదిక వెల్లడి

Ukrainian Detainees Tortured

Updated On : August 2, 2023 / 10:46 AM IST

Ukrainian Detainees Tortured :  యుక్రెనియన్ ఖైదీలపై రష్యా సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించారని బుధవారం వెల్లడైంది. రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్ లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లో యుక్రెనియన్ ఖైదీలను హింసించడంతోపాటు మహిళా ఖైదీలను లైంగికంగా వేధించారని అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం వెల్లడించింది. (Ukrainian Detainees Tortured)

మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు

అంతర్జాతీయ మానవతా న్యాయ సంస్థ గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ ద్వారా స్థాపించిన మొబైల్ జస్టిస్ టీమ్ విడుదల చేసిన నివేదికలో రష్యా సైనికుల ఆగడాలను బయటపెట్టారు. (Russian Forces) బ్రిటన్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ నిధులు సమకూర్చిన మొబైల్ జస్టిస్ టీమ్ ఖెర్సన్ ప్రాంతంలోని 35 ప్రాంతాల్లో 320 మంది సాక్షులను విచారించింది.

Gurugram clashes : గురుగ్రామ్‌లో హింసాకాండ…మళ్లీ వర్క్ ఫ్రం హోం

రష్యన్ గార్డులు తమను లైంగికంగా వేధించారని బాధితులు చెప్పారు. యుక్రెనియన్ ఖైదీలకు కరెంట్ షాక్ లు ఇచ్చి ఊపిరాడకుండా చేశారని నివేదిక తెలిపింది. తమను విచారించే సమయంలో తరచూ విద్యుదాఘాతం ప్రయోగించారని, ఓ మహిళా ఖైదీపై అత్యాచారం కూడా చేశారని నివేదిక పేర్కొంది.