Gurugram clashes : గురుగ్రామ్‌లో హింసాకాండ…మళ్లీ వర్క్ ఫ్రం హోం

గురుగ్రామ్ నగరంలో కార్పొరేట్ కంపెనీలు మంగళవారం నుంచి మళ్లీ వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. హర్యానాలో కొనసాగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్‌లోని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేందుకు చర్యలు చేపట్టాయి....

Gurugram clashes : గురుగ్రామ్‌లో  హింసాకాండ…మళ్లీ వర్క్ ఫ్రం హోం

Gurugram clashes wfh

Gurugram clashes : గురుగ్రామ్ నగరంలో కార్పొరేట్ కంపెనీలు మంగళవారం నుంచి మళ్లీ వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. హర్యానాలో కొనసాగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్‌లోని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేందుకు చర్యలు చేపట్టాయి. (Gurugram clashes) మంగళవారం గురుగ్రామ్ నగరంలో హింసాత్మక సంఘటనలు జరగడంతో చాలా కంపెనీలు సాధారణ కార్యాలయ పని వేళలను తగ్గించాలని నిర్ణయించాయి.

మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు

దీంతో పాటు రాబోయే కొద్ది రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కార్పొరేట్ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. (Companies tell employees to work from home) ఐటీ, ఫైనాన్షియల్, మెడికల్ టూరిజం హబ్ అయిన గురుగ్రామ్ నగరంలో 30వేలకు పైగా కంపెనీలున్నాయి. గురుగ్రామ్ పరిసర ప్రాంతాల్లో మత ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు జారీ చేశాయి.

Manipur : మణిపుర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం..6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వడానికి సోహ్నా సబ్-డివిజన్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా పలు కార్పొరేట్ సంస్థలు ఆగస్ట్ 4వతేదీ వరకు రిమోట్ వర్క్ సెటప్‌ను అమలు చేస్తున్నాయి. ఆన్ లైన్ డెలివరీలు నిలిపివేశారు. ముస్లింలు సొసైటీల వారీగా ఇంట్లోనే ఉండాలని కోరారు. గురుగ్రాంలోని హీరో మోటోకార్ప్‌లో అధికారులు 144 సెక్షన్ అమలు చేయడం వల్ల ఉద్యోగులు ప్రస్తుతం రిమోట్‌లో పని చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మారుతీ ఉద్యోగులు ఆన్ సైట్ పనిని పునఃప్రారంభించారు.

Seema -Sachin Love Story : సీమాహైదర్‌ను పాక్ తిరిగి పంపిస్తారా? యూపీ సీఎం యోగి ఏమన్నారంటే…

ప్రస్తుతానికి కంపెనీల్లో ఉత్పత్తి నిలిపివేయలేదు. అధికారులు జారీ చేసే ఏవైనా ఆదేశాలను అనుసరించడానికి అన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. గురుగ్రామ్ ప్రాంతంలో సెక్షన్ 144 అమలు చేశారు. మీరందరూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాం, గురుగ్రాంలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని లింక్డ్ఇన్ వంటి కంపెనీలు చెప్పాయి.