Manipur : మణిపుర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం..6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు

మణిపూర్‌లో హింసాకాండ చెలరేగడంతో 30 మంది అదృశ్యమయ్యారు. మణిపూర్ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని పోలీసులు అంటున్నారు....

Manipur : మణిపుర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం..6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు

Manipur violence

Manipur : మణిపుర్‌లో హింసాకాండ చెలరేగడంతో 30 మంది అదృశ్యమయ్యారు. మణిపుర్‌ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపుర్‌ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని పోలీసులు అంటున్నారు. (30 Go Missing) అల్లర్ల అనంతరం మణిపుర్‌ కు ( Manipur) చెందిన సమరేంద్ర సింగ్ భార్య కవిత కనిపించడం లేదు.

Government Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం

హింసాకాండ ప్రారంభం అనంతరం జర్నలిస్ట్, పరిశోధకుడు, సామాజిక కార్యకర్త అయిన సింగ్ అదృశ్యమయ్యారు. అతనితోపాటు ఉన్న 48 ఏళ్ల యుమ్ ఖైబామ్ కిరణ్ కుమార్ సింగ్ అల్లర్ల అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. వీరిద్దరూ అల్లర్ల తర్వాత కాంగ్ పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఉన్న మణిపూర్ ఒలింపిక్ పార్కు వద్ద ఉన్న సాహెబంగ్ ప్రాంతానికి వెళ్లారు. అప్పటి నుంచి వారి సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ లో ఉన్నాయి. మిస్సింగ్ ఫిర్యాదుతో సోదాలు నిర్వహిస్తున్నామని, అయితే ఇంతవరకు అదృశ్యమైన వారి జాడ తెలియలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

Shriya Saran : రోమ్ లో భర్తతో కలిసి సందడి చేస్తున్న శ్రియ.. ఫోటోలు!

తాను ఢిల్లీలో చదవాలని తన తండ్రి కోరుకునే వాడని, ఇప్పుడు ఆయన కనిపించకుండా పోవడంతో తానెలా చదువుకోవాలని సింగ్ కుమారుడు ఆటమ్ దోహెన్బా ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రభుత్వం డీఎన్ఏ నమూనాలు సేకరించకుండానే మృతదేహాలకు అంత్యక్రియలు చేసిందని, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనుగొనలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Madhya Pradesh: బీజేపీ పాలిత రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. హిందూ మతం స్వీకరించిన 190 మంది ముస్లింలు

నీట్ కోచింగ్ తరగతుల కోసం హిజామ్ లువాంగ్బీ, ఫిజామ్ హేమంజిత్ లు బైక్ పై వెళ్లి ఆచూకీ లేకుండా పోయారని వారి తల్లిదండ్రులు వేర్వేరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. (Left For Classes, Never Returned) ఇద్దరు విద్యార్థులు ఇంఫాల్ లోయలోని నంబోల్ ప్రాంతం వైపు వెళుతున్నట్లు గుర్తించిన సీసీటీవీ ఫుటేజీ ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంఫాల్ ఆసుపత్రుల్లో ఇంకా 44 మృతదేహాలు మగ్గుతున్నాయి. మృతదేహాలను ఖననం చేయడానికి పంపాలని తాము అధికారులను అభ్యర్థించామని ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ ప్రతినిధి గింజా వల్జాంగ్ తెలిపారు.