Madhya Pradesh: బీజేపీ పాలిత రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. హిందూ మతం స్వీకరించిన 190 మంది ముస్లింలు

పుణ్యక్షేత్రమైన నెమవార్‌లోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మతమార్పిడి జరిగింది. ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి, నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు.

Madhya Pradesh: బీజేపీ పాలిత రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. హిందూ మతం స్వీకరించిన 190 మంది ముస్లింలు

Islam to Hindu: మతమార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హిందూ మతంలో ఉన్నవారిని బలవంతంగానో మభ్యపెట్టో ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటూ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు, రైట్ వింగ్ సంస్థలూ తరుచూ వివాదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది. సుమారు 190 మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు. హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది.

Modi And Pawar: ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పరోక్షంగా వివరణ ఇచ్చుకున్న శరద్ పవార్

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలో 35 కుటుంబాలకు చెందిన 190 మంది హిందూమతం స్వీకరించారు. అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగొచ్చారు. తమ పూర్వీకులు హిందువులని, వారు మతం మారారని చెప్పారు. అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని, ఈరోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు.

Bihar: అంత్యక్రియలు చేసిన 7 సంవత్సరాలకు తిరిగొచ్చిన కొడుకు.. ఒక్కసారిగా చూసి అందరూ షాక్

పుణ్యక్షేత్రమైన నెమవార్‌లోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మతమార్పిడి జరిగింది. ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి, నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు. అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు. ఇక రాంసింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ.. ‘‘మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికీ మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది. ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది. అందుకే అందరం తిరిగొచ్చాము’’ అని అన్నారు.

UP Politics: బద్రినాథ్, జ్ఞానవాపి వివాదాలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఎస్పీలపై మండిపడ్డ బీఎస్పీ సుప్రెమో మాయావతి

హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు 55 మంది యువకులు, 50 మంది మహిళలు ఉన్నారు. ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు. వీరంతా ప్రాథమికంగా రత్లాం జిల్లాలోని అంబ గ్రామ నివాసితులు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్లు తమ కులదేవతను పూజించారట. అంతే కాకుండా.. అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సంప్రదాయంలోనే జరిగేవట.