Earthquake : ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. Delhi Earthquake

Earthquake : ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Delhi Earthquake(Photo : Google)

Delhi Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్ సీఆర్ సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో అప్ఘానిస్థాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.8గా నమోదైంది. భూమికి 181 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు.

అప్ఘానిస్థాన్‌లోని హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. జమ్ముకశ్మీర్‌, పాకిస్తాన్‌, అప్ఘానిస్థాన్‌ సరిహద్దుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూప్రకంపనలు ఢిల్లీ, జమ్ముకశ్మీర్ ని కూడా తాకాయి. భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు.

Also Read..Data Protection Bill: డిజిటల్ బిల్లు పార్లమెంటులోకి వచ్చింది. ఇంతకీ ఈ డిజిటల్ బిల్లు ఏంటో తెలుసా?

అప్ఘానిస్థాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రత్యేకంగా హిందూకుష్‌ పర్వత ప్రాంతాల్లోని యూరేసియన్‌, ఇండియన్‌ టెక్టోనిక్‌ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపానికి కారణమవుతున్నాయి.