పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. తప్పిన పెనుప్రమాదం.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలో శనివారం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అమ్రోహాలోని కళ్యాణ్ పురా రైల్వే గేట్ సమీపంలో ...

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. తప్పిన పెనుప్రమాదం.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Goods train

Goods Train : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలో శనివారం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అమ్రోహాలోని కళ్యాణ్ పురా రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో రైలుకు చెందిన ఎనిమిది బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని రైలు పట్టాలపై పడిపోయిన రైలు బోగీలను తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా ఢిల్లీ – లక్నో వెళ్లే మార్గాల్లో పలు రైళ్లు రద్దుకాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

Also Read : ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్‌.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా రిష‌బ్ పంత్..! కేఎల్ రాహుల్ పయనం ఎటంటే?

శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై మొరాబాద్ డీఆర్ఎం రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మేము రెండు లైన్లలో ఏకకాలంలో పనులు చేస్తున్నాం. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభించడానికి మొదట ఓ రైల్వే లైన్ ను సరిచేశాం. మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. అయితే, ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఏమిటనే విషయంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

Also Read : భార్యకోసం రోజుకు 320 కి.మీ ప్రయాణిస్తున్న భర్త.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..