Heath Streak Not Dead: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు! థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్ చేసిన హెన్రీ ఒలంగ

హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువగా వ్యాపించాయి. నేను ఇప్పుడే అతనితో మెస్సేజ్ చేశాను. అతను సజీవంగానే ఉన్నాడు.

Heath Streak Not Dead: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు! థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్ చేసిన హెన్రీ ఒలంగ

Heath Streak

Heath Streak : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ బుధవారం ఉదయం ట్వీట్ చేశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ స్ట్రీక్ చనిపోయాడని సంతాపంసైతం ప్రకటించాడు. జింబాబ్వే ప్రస్తుత కెప్టెన్ సీన్ విలియమ్స్ సైతం నివాళులర్పిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో హీత్ స్ట్రీక్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే హెన్రీ ఒలంగ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో హీత్ స్ట్రీక్ చనిపోలేదని, బతికే ఉన్నాడంటూ పేర్కొన్నాడు. హెన్రీ ఒలంగా రెండోసారి చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నాడు.. ‘ స్ట్రీక్ మరణం పుకార్లు చాలా అతిశయోక్తిగా ఉన్నాయి.. కొద్ది సేపటి కిందటే తాను అతనితో మాట్లాడినట్లు కూడా ఒలంగ చెప్పాడు. దీంతో హీత్ స్ట్రీక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Suryakumar Yadav: కోహ్లీతో రన్నింగ్ చేస్తున్న ఫొటో‌ను షేర్ చేసిన అనుష్క శర్మ.. సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్

‘హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువగా వ్యాపించాయి. నేను ఇప్పుడే అతనితో మెస్సేజ్ చేశాను. మూడో అంపైర్ అతన్ని మళ్లీ వెనక్కి పిలిచాడు. స్ట్రీక్ బతికే ఉన్నాడు అంటూ ఒలంగ తన రెండో ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు.. స్ట్రీక్ తో చేసిన వాట్సాప్ చాట్ ను కూడా ట్వీటర్‌లో షేర్ చేశాడు. మరోవైపు ఒలంగ తొలుత చేసిన తప్పుడు ప్రకటన పట్ల  హీత్ స్ట్రీక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి విషయాలు ధ్రువీకరించకుండా ట్వీట్లు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

హీత్ స్ట్రీక్ కెరీర్‌లో 12 ఏళ్ల పాటు 65 టెస్ట్ మ్యాచ్‌లు, 189 వన్డేలు ఆడాడు. జింబాబ్వే నుంచి 100 టెస్టు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా హీత్ స్ట్రీక్ నిలిచారు. స్ట్రీక్ 2000, 2004 మధ్య జింబాబ్వే క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. స్ట్రీక్ కెరీర్ 1993లో పాకిస్తాన్‌ జట్టుతో మ్యాచ్‌లో అరంగేట్రంతో ప్రారంభమైంది. రావల్పిండిలో తన రెండవ టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా తనను తాను నిరూపించుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత స్ట్రీక్ జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లతో కోచింగ్ పాత్ర పోషించారు.