Harry Brook : చ‌రిత్ర సృష్టించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాడు, ఇంగ్లాండ్‌ యువ క్రికెట‌ర్ హ్యారీ బ్రూక్ చ‌రిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగుల్లో సెంచ‌రీలు బాదిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Harry Brook : చ‌రిత్ర సృష్టించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు

Harry Brook

Harry Brook Century : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాడు, ఇంగ్లాండ్‌ యువ క్రికెట‌ర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చ‌రిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), ది హండ్రెడ్ లీగ్(THL), పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో లీగుల్లో సెంచ‌రీలు బాదిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. బ్రూక్ కంటే ముందు చాలా మంది ఈ మూడు లీగుల్లో ఆడిన‌ప్ప‌టికీ ఏ ఆట‌గాడు కూడా సెంచ‌రీల మోత మోగించ‌లేదు. 2022 పీఎస్ఎల్ సీజ‌న్‌లో, 2023 ఐపీఎల్ సీజ‌న్‌లో శ‌త‌కాలు బాదిన బ్రూక్ తాజాగా ది హండ్రెడ్ లీగ్‌లో సెంచ‌రీ చేయ‌డంతో ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు.

ది హండ్రెడ్ లీగ్‌లో బ్రూక్ నార్త్రన్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. మంగ‌ళ‌వారం వెల్ష్ ఫైర్, నార్త్రన్ సూపర్ చార్జర్స్ జ‌ట్లు పోటీప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రూక్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో 105 ప‌రుగులు చేశాడు. 41 బంతుల్లోనే అత‌డు సెంచ‌రీ చేయ‌గా.. ఈ టోర్నీ చ‌రిత్ర‌లోనే ఇది ఫాస్టెస్ట్ సెంచ‌రీ కావ‌డం విశేషం.

IRE vs IND 3rd T20 : ఒక్క బంతి ప‌డ‌లేదు.. మ్యాచ్ ర‌ద్దు.. సిరీస్ టీమ్ఇండియాదే

2022 పీఎస్ఎల్‌లో బ్రూక్ లాహోర్ ఖ‌లంద‌ర్స్ త‌రుపున ఆడాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స‌ర్లు సాయంతో 102 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచాడు. ఈ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ చూసే ఐపీఎల్ 2023 సీజ‌న్‌కు ముందు బ్రూక్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.13.25కోట్లు పెట్టి కొంది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 100 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్ మిన‌హా సీజ‌న్ మొత్తం దారుణంగా విఫ‌లం అయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడి 190 పరుగులు మాత్ర‌మే చేశాడు. మూడు మ్యాచుల్లో డ‌కౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు ఈ ఆట‌గాడిని వ‌దులుకునే ఆలోచ‌న‌లో ఉంది హైద‌రాబాద్‌.

Team India : నంబ‌ర్ 4 స్థానానికి స‌రైనోడు ఎవ‌రు..? 2019 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత నుంచి 12 మంది ఆడితే..

ఇంగ్లాండ్ త‌రుపున గ‌తేడాదే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుపెట్టాడు బ్రూక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్ త‌రుపున 12 టెస్టులు, 3 వ‌న్డేలు, 20 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 4 శ‌తకాలు, 7 అర్థ‌శ‌త‌కాల సాయంతో 1,181 ప‌రుగులు చేశాడు. వ‌న్డేల్లో 86 ప‌రుగులు, టీ20ల్లో 372 ప‌రుగులు చేశాడు.