Frustrated Batter : నన్నే ర‌నౌట్ చేస్తావా.. బ్యాటిచ్చుక్కొట్టిన‌ నాన్ స్ట్రైక‌ర్‌.. వీడియో వైర‌ల్‌

క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్ అని అంటారు. అప్పుడ‌ప్పుడు ఈ ఆట‌లో కొన్ని సార్లు గ‌మ్మ‌త్తైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి.

Frustrated Batter : నన్నే ర‌నౌట్ చేస్తావా.. బ్యాటిచ్చుక్కొట్టిన‌ నాన్ స్ట్రైక‌ర్‌.. వీడియో వైర‌ల్‌

Frustrated Batter

Frustrated Batter Hits Teammate : క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్ అని అంటారు. అప్పుడ‌ప్పుడు ఈ ఆట‌లో కొన్ని సార్లు గ‌మ్మ‌త్తైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. ఓ బ్యాట‌ర్ ర‌నౌట్ కావ‌డంతో ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. ఆ కోపంలో త‌న చేతిలో ఉన్న బ్యాటును విసిరివేశాడు. అయితే.. ఆ బ్యాట్ నేరుగా వెళ్లి స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మ‌రో బ్యాట‌ర్ ముఖాన్ని గ‌ట్టిగా తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

World Cup 2023 Tickets : టికెట్ల కోసం పోటెత్తిన అభిమానులు.. సైట్ క్రాష్‌.. మున్ముందు క‌ష్టాలేనా..!

ఆ వీడియోలో ఏం ఉందంటే.. బౌల‌ర్ బంతిని వేయ‌గా బ్యాట‌ర్ షాట్ కొడ‌తాడు. ప‌రుగు తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అయితే.. బంతి ఫీల్డ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్ల‌డంతో వెన‌క్కి త‌గ్గుతాడు. అయితే.. అప్ప‌టికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మ‌రో బ్యాట‌ర్ ప‌రుగు కోసం పిచ్ స‌గానికి పైగా ప‌రుగెత్తుతాడు. స్ట్రైకింగ్ బ్యాట‌ర్ వెన‌క్కి వెళ్ల‌డంతో ఇత‌డు కూడా మ‌ళ్లీ వెన‌క్కి మ‌ళ్లీ.. క్రీజులోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే.. అప్ప‌టికే ఫీల్డ‌ర్ బంతిని విస‌ర‌గా అది వికెట్ల‌ను తాకింది. దీంతో నాన్ స్ట్రైక‌ర్ బ్యాట‌ర్ ర‌నౌట్ అవుతాడు.

Yuvraj Singh : మ‌రోసారి తండ్రైన యువ‌రాజ్ సింగ్‌.. నిద్రలేని రాత్రులు సంతోషాన్నిస్తున్నాయి

తాను ఔట్ కావ‌డంతో నాన్ స్ట్రైక‌ర్ బ్యాట‌ర్ అస‌హ‌నానికి గురి అవుతాడు. పెవిలియ‌న్ వైపు వెలుతూ త‌న చేతిలోని బ్యాట్‌ను కోపంతో విసిరివేశాడు. ఆ బ్యాట్ గింగిరాలు తిరుగుతూ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్ ముఖానికి త‌గులుతుంది. దెబ్బ‌కు అత‌డు కింద‌ప‌డిపోయాడు. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు ఈ ఘ‌ట‌న జ‌రుగుతున్న స‌మ‌యంలో వికెట్ తీసిన ఆనందంలో సంబురాలు చేసుకోవ‌డాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ఘ‌ట‌న ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింది అనే విష‌యాలు మాత్రం తెలియ‌రాలేదు గానీ వీడియో మాత్రం వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వీడియో చూసేయండి.

BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!