BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!

యో-యో టెస్టులో పాల్గొన్న విరాట్ కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చిదంట. కనీసం 16.5 స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. యో-యో టెస్టులో కోహ్లీ పాస్ అయినప్పటికీ కొందరు క్రికెటర్లు ..

BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!

YO YO Test

Virat Kohli : టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీని ఉద్దేశిస్తూ బీసీసీఐ సూచన చేసింది. ఇంతకీ బీసీసీఐ ఇచ్చిన సూచన ఏమిటంటే.. టీమిండియా జట్టు ఆసియా కప్-2023కు సిద్ధమవుతోంది. ఆగస్టు 30 నుంచి టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే, సెప్టెంబర్ 2న తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో భారత్ జట్టు తలపడనుంది. ఆసియా కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ టీంను ఎంపిక చేసింది. వీరందరికి యో-యో టెస్టులు నిర్వహిస్తుంది. ఈ టెస్టులో కోహ్లీ పాస్ అయ్యాడు. ఆ విషయాన్ని కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

Sourav Ganguly: వారం రోజుల్లో భారత్-పాక్ వన్డే మ్యాచ్.. సౌరవ్ గంగూలీ ఏమన్నారో తెలుసా?

యో-యో టెస్టులో పాల్గొన్న విరాట్ కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చిదంట. కనీసం 16.5 స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. యో-యో టెస్టులో కోహ్లీ పాస్ అయినప్పటికీ కొందరు క్రికెటర్లు ఆ మార్క్‌ను తాకలేదని తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుందేమోననే ఆందోళన బీసీసీఐలో వ్యక్తమయింది. వెంటనే బీసీసీఐ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసింది. యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని, పరీక్ష రిజల్ట్స్ ను ఎవరితోనూ పంచుకోవద్దని బీసీసీఐ స్వీట్ వార్నింగ్ ఇచ్చిందట.

Sourav Ganguly : టీ20ల్లో రోహిత్ శ‌ర్మ‌, కోహ్లిల కెరీర్ ముగిసిన‌ట్లేనా..? గంగూలీ చెప్పింది ఇదే..

యో-యో టెస్టుల స్కోర్‌కు సంబంధించిన విషయాలను కొందరు పంచుకుంటున్నారని, అలా చేయడం కాంట్రాక్ట్ క్లాజ్ ధిక్కరణ కిందకు వస్తుందని, ఇలాంటివి చేయొద్దని మౌఖింగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.