Yuvraj Singh : మ‌రోసారి తండ్రైన యువ‌రాజ్ సింగ్‌.. నిద్రలేని రాత్రులు సంతోషాన్నిస్తున్నాయి

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ( Yuvraj Singh )మ‌రోసారి తండ్రి అయ్యాడు. అత‌డి భార్య, న‌టి హాజెల్ కీచ్ (Hazel Keech) పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

Yuvraj Singh : మ‌రోసారి తండ్రైన యువ‌రాజ్ సింగ్‌.. నిద్రలేని రాత్రులు సంతోషాన్నిస్తున్నాయి

Yuvraj Singh

Yuvraj Singh becomes father again : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ (Yuvraj Singh) మ‌రోసారి తండ్రి అయ్యాడు. అత‌డి భార్య, న‌టి హాజెల్ కీచ్ (Hazel Keech) పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇంటికి మ‌హాల‌క్ష్మి వ‌చ్చింద‌నే విష‌యాన్ని శ్రావ‌ణ శుక్ర‌వారం రోజున సోష‌ల్ మీడియా వేదిక‌గా యువీ తెలియ‌జేశాడు. చిన్నారికి ఆరా అని పేరు పెట్టిన‌ట్లు చెప్పాడు.

“మా లిటిల్ ప్రిన్సెస్ ఆరా రాక కార‌ణంగా నిద్ర‌లేని రాత్రుల‌ను కూడా ఎంతో ఆనందంగా గ‌డిపేస్తున్నాం. త‌న రాక‌తో మా కుటుంబం ప‌రిపూర్ణ‌మైంది.” అంటూ యువ‌రాజ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అంతేకాదండోయ్ త‌న కుటుంబ ఫోటోను సైతం షేర్ చేశాడు. ఇందులో యువీ భార్య హాజెల్ కీచ్ ఒడిలో కుమారుడు ఉండ‌గా యువీ త‌న ప్రిన్సెన్స్‌ను ఎత్తుకుని పాలు ప‌ట్టిస్తున్నాడు. ఈ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. యువ‌రాజ్ అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Neeraj Chopra : భ‌ళా నీర‌జ్ చోప్రా.. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత

యువీ, హాజెల్ కీచ్ లు 2011లో ఓ పార్టీలో క‌లుసుకున్నారు. వీరిద్ద‌రికి హ‌ర్భ‌జ‌న్ సింగ్ కామ‌న్ ఫ్రెండ్‌. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో 2016 న‌వంబ‌ర్ 30న ఈ జంట వివాహం చేసుకుంది. వీరికి 2022 జ‌న‌వ‌రిలో కుమారుడు జ‌న్మించాడు. అత‌డికి ఓరియన్ కీచ్ సింగ్ అని పేరు పెట్టారు. తాజాగా కూతురు జ‌న్మించ‌డంతో యువీ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ భార‌త జ‌ట్టు సాధించ‌డంలో యువ‌రాజ్ కీల‌క పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ‌ర్‌గా అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో త‌న‌దైన శైలిలో రాణించి జ‌ట్టుకు విజ‌యాల‌ను అందించాడు. 2000 అక్టోబ‌ర్‌లో కెన్యాపై అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన యూవీ 2019లో ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. యువ‌రాజ్ ఎన్ని ప‌రుగులు చేసిన‌ప్ప‌టికి 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్టువ‌ర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాద‌డం క్రికెట్ అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు.

BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)