2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు!
2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్ కలిగి ఉంది. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.
![2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు! 2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు!](https://10tv.in/wp-content/uploads/2023/09/2023-Honda-CB300F-Launched-In-India-At-Rs-1.70-Lakh.jpg)
2023 Honda CB300F Launched In India At Rs 1.70 Lakh
2023 Honda CB300F Launch : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) నుంచి OBD-II నిబంధనలకు అనుగుణంగా హోండా CB300F 2023ని లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1,70,000 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కు అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ఈ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇప్పుడు OBD-2 కంప్లైంట్ పవర్‌ప్లాంట్‌తో వస్తుంది. హోండా CB300F 2023లో 293cc, ఆయిల్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, PGM-Fi ఇంజిన్ ఉంది. గరిష్టంగా 24.5PS శక్తిని 25.6Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హోండా CB300F 2023లో USD ఫ్రంట్ ఫోర్క్‌లు, బ్యాక్ వైపున 5-ఫేస్ ఎడ్జెస్ట్ మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.
ఇందులో డ్యూయల్-ఛానల్ ABS, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను (276mm ఫ్రంట్, 220mm బ్యాక్) పొందుతుంది. హోండా CB300F 2023 టాప్ ఫీచర్లలో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS), ఆల్-LED లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, గడియారానికి సంబంధించి 5 లెవల్స్ కస్టమైజడ్ ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్యూటర్ ఉంది. హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్లో స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే 3 విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
2023 హోండా CB300F పర్పార్మెన్స్ :
293cc, ఆయిల్-కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD-II A కంప్లైంట్ PGM-FI ఇంజిన్‌తో 18kW పవర్, 25.6Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. CB300F 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. స్పీడ్ గేర్ షిఫ్ట్‌లను ఎనేబుల్ చేసేందుకు లో ఫోర్స్ అవసరమయ్యే అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌ను పొందుతుంది. డౌన్‌షిఫ్టింగ్ సమయంలో బ్యాక్ వీల్స్ హోపింగ్ నిరోధిస్తుంది.
![2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్.. ధర ఎంతో తెలుసా? ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు! 2023 Honda CB300F Launched In India At Rs 1.70 Lakh](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/09/2023-Honda-CB300F-Launched-In-India-At-Rs-1.70-Lakh-1.jpg)
2023 Honda CB300F Launched In India At Rs 1.70 Lakh
డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు (276mm ఫ్రంట్ & 220mm బ్యాక్) డ్యూయల్-ఛానల్ ABS, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) పర్పార్మెన్స్‌తో సెక్యూరిటీని అనుసంధానించగా, గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్, 5-ఫేస్ ఎడ్జెస్ట్ చేయగల బ్యాక్ మోనో షాక్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి.
2023 హోండా CB300F ఫీచర్లు :
CB300F అధునాతన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ 5 స్థాయిల కస్టమైజడ్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతరాయం లేని కనెక్టివిటీకి ఆల్-LED లైటింగ్ సిస్టమ్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS)ని కూడా పొందుతుంది.
2023 హోండా CB300F ధర & కలర్లు :
2023 హోండా CB300F OBD-II A డీలక్స్ ప్రో వేరియంట్, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ & మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఉన్నాయి. ఈ కొత్త బైక్ ధర రూ. 1,70,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
Read Also : Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 ఈరోజే లాంచ్.. భారత్‌లో తయారైన ఈ ఐఫోన్ ధర తక్కువగా ఉంటుందా?