Shobu Yarlagadda : ప్రభాస్ మైనపు విగ్రహం.. వెంటనే తీసేయాలంటూ బాహుబలి నిర్మాత సీరియస్.. నెటిజన్స్ ట్రోల్స్..

తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ(Wax Statue) ఆడియన్స్ ముందుకు వచ్చింది. బెంగళూరులోని మైనపు మ్యూజియంలో ఈ కొత్త ప్రభాస్ బొమ్మని ఏర్పాటు చేశారు. ఈ మైనపు బొమ్మని కూడా బాహుబలి అవతార్ లోనే ఏర్పాటు చేశారు.

Shobu Yarlagadda : ప్రభాస్ మైనపు విగ్రహం.. వెంటనే తీసేయాలంటూ బాహుబలి నిర్మాత సీరియస్.. నెటిజన్స్ ట్రోల్స్..

Prabhas Wax Statue in Bengaluru Museum Photos goes viral Bahubali Producer Shobu Yarlagadda Fires in Social Media

Shobu Yarlagadda :  ప్రభాస్(Prabhas) ‘బాహుబలి’(Bahubali) సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రభాస్ క్రేజ్ ని గుర్తించిన లండన్ లోని ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియం గతంలోనే అక్కడ బాహుబలి అవతార్ లో ప్రభాస్ మైనపు బొమ్మని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దీంతో ప్రభాస్ కి మరింత గుర్తింపు వచ్చిందని అభిమానులు, బాహుబలికి కూడా మంచి రీచ్ వచ్చిందని చిత్రయూనిట్ సంతోషించారు.

ఇప్పుడు తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ(Wax Statue) ఆడియన్స్ ముందుకు వచ్చింది. బెంగళూరులోని మైనపు మ్యూజియంలో ఈ కొత్త ప్రభాస్ బొమ్మని ఏర్పాటు చేశారు. ఈ మైనపు బొమ్మని కూడా బాహుబలి అవతార్ లోనే ఏర్పాటు చేశారు. ఈ బొమ్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ మైనపు బొమ్మని చూసిన నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.

ఆ మైనపు విగ్రహం చూడడానికి అసలు ప్రభాస్ లాగానే లేదు. బాహుబలి గెటప్ లో ఎవరిదో మైనపు విగ్రహం పెట్టారని,డేవిడ్ వార్నర్ లా ఉన్నాడని, ఆ బొమ్మని తీసేయాలని, ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయొద్దని అభిమానులు, నెటిజన్లు ఆ మైనపు బొమ్మపై ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ బాహుబలి మైనపు బొమ్మ కాస్త వివాదంలో నిలిచింది. అయితే దీనిపై బాహుబలి నిర్మాత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

Also Read : Sundeep Kishan : ప్రభాస్ ప్రాజెక్ట్ K.. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ Z.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..

సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఈ బొమ్మని షేర్ చేయగా.. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ దానిని రీ షేర్ చేసి.. ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకొని చేసిన వర్క్ కాదు. ఎలాంటి సమాచారం, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ బొమ్మని చేశారు. ఈ బొమ్మని తీసేయడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం అని సీరియస్ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి బెంగుళూరులోని ఆ మ్యూజియం వాళ్ళు ఈ ప్రభాస్ మైనపు బొమ్మని తీసేస్తారా లేక నిర్మాత శోభు యార్లగడ్డ వీరిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారా చూడాలి.