Shiva Rajkumar : తెలుగు హీరోలపై ప్రశంసలు కురిపించిన శివన్న.. ఎవరెవరి గురించి అంటే?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు హీరోలను పొగడ్తల్లో ముంచేశారు. ఘోస్ట్ సినిమా ప్రమోషన్లో భాగంగా కొందరు తెలుగు నటులతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. వారెవరెవరంటే?
![Shiva Rajkumar : తెలుగు హీరోలపై ప్రశంసలు కురిపించిన శివన్న.. ఎవరెవరి గురించి అంటే? Shiva Rajkumar : తెలుగు హీరోలపై ప్రశంసలు కురిపించిన శివన్న.. ఎవరెవరి గురించి అంటే?](https://10tv.in/wp-content/uploads/2023/09/New-Project-3-50.jpg)
Shiva Rajkumar
Shiva Rajkumar : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన సినిమా ‘ఘోస్ట్‘ అక్టోబర్ 19 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న శివన్న తెలుగు హీరోల తెగ మెచ్చుకున్నారు. వారిపై ప్రశంసలు కురిపించారు. ఎవరెవరిని పొగిడారంటే?
శ్రీని డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ‘ఘోస్ట్‘ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ హోరెత్తిస్తున్నాయి. అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించిన విశేషాలు మాట్లాడుతూ శివన్న కొందరు తెలుగు హీరోలపై పొగడ్తలు కురిపించారు. వారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
హీరో రవితేజ, శివన్న మంచి మిత్రులు. ‘వజ్రకాయ’ సినిమా షూటింగ్ టైమ్‌లో చాలాసార్లు కలుసుకున్నారు. రవితేజ స్క్రీన్ ముందు, వెనుక కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారని, అతని ఎనర్జీ లెవెల్స్ ఫ్యాన్స్‌కి బూస్టర్ లాంటిదని శివన్న చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారని, కన్నడ చక్కగా మాట్లాడే తనని తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో ఇష్టపడతారని చెప్పుకొచ్చారు.
Balakrishna : బాలయ్య – శివన్న సినిమాపై క్లారిటీ.. త్వరలోనే పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిలిం..
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా అభిమానులు అడిగిన ప్రశ్నలకు శివన్న సమాధానం ఇచ్చారు. మహేష్ తక్కువ మాట్లాడతారని చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారని అలాంటి వ్యక్తి స్క్రీన్ మీద మెరుపులు చూపిస్తారని శివన్న చెప్పారు. వపర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని తనలాగ ఫుల్ ఎనర్జీ ఉన్న వ్యక్తి పవన్ అని శివన్న చెప్పారు. ఇంకా హీరో సూర్యలోని చిరునవ్వు, క్రికెటర్ ధోనీలో కామెనెస్ తనకు చాలా ఇష్టమని చెప్పారు శివన్న.
Working with @RaviTeja_offl Garu was an absolute blast. He literally is a ball of energy both on and off screen. I’m sure his energy is a booster to all his fans. love ❤️ #AskNimmaShivanna #Ghost #GhostOct19 https://t.co/R49WrgOsIO
— DrShivaRajkumar (@NimmaShivanna) September 29, 2023
He’s a man of few words. Extremely dignified, and professional in his approach. It’s a pleasure to see such soft spoken person explode on screen with electrifying performances. Wishing you the best @urstrulyMahesh garu and the to the fans that have loved you so much!… https://t.co/Jnb7IjRuop
— DrShivaRajkumar (@NimmaShivanna) September 28, 2023
Thanks for the question @TrendPSPK
He’s a dear friend. Somebody who is as energetic as me. Wishing @PawanKalyan garu and all his fans long life and happiness.
Also, here’s the picture you asked for. #AskNimmaShivanna #GhostOct19 #Ghost https://t.co/E3yoBr3ena pic.twitter.com/0utYwNs71i
— DrShivaRajkumar (@NimmaShivanna) September 28, 2023
To speak Kannada you need a big heart and my brother @tarak9999 has the biggest heart. He not just speaks the language he even sang a song. My entire family loves him and will always wish him the best. Love to all Tarak fans. #AskNimmaShivanna #GhostOct19 #Ghost https://t.co/NVD2SS5fyw
— DrShivaRajkumar (@NimmaShivanna) September 28, 2023