Snake Bite : పాము కాటు వేసినా చనిపోని జంతువులు ఏవో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి లక్ష మందికిపైగా పాముకాటు వల్ల మరణిస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం భారత్ లో జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏ పాము కరిస్తే..మనిషి నాడీ వ్యవస్థమీద పనిచేస్తుంది. కండరాలను పనిచేయకుండా చేసి ప్రాణాలు తీస్తుంది.

Snake Bite : పాము కాటు వేసినా చనిపోని జంతువులు ఏవో తెలుసా..?

Snake Bite : ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి లక్ష మందికిపైగా పాముకాటు వల్ల మరణిస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం భారత్ లో జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏ పాము కరిస్తే..మనిషి నాడీ వ్యవస్థమీద పనిచేస్తుంది. కండరాలను పనిచేయకుండా చేసి ప్రాణాలు తీస్తుంది. అది మనిషికి అయినా జంతువులకైనా. బ్లాక్ మాంబా అనే భయంకరమైన విషసర్పం కాటు వేస్తే భారీ ఏనుగు కూడా చనిపోతుంది. కానీ పాము కాటు వేసినా చనిపోని కొన్ని జంతువులున్నాయి. అవి ఏనుగులాంటి భారీ జంతువులు కాదు చిన్న చిన్న జంతువులు. మరి పాము కాటు వేస్తే భారీ ఏనుగే చనిపోతుంది..మరి ఈ చిన్న జంతువులు ఎందుకు చనిపోవు..?కారణమేంటీ..? పాము కాటు వేసినా చనిపోని ఆ జంతువులేంటో తెలుసుకుందాం..


సాధారణంగా పాముతో పోరాటం అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చి జంతువు ముంగిస. ముంగిస పాము పోట్లాడుకుంటే పాము తోకముడిచి పారిపోవాల్సింది. మెరుపు వేగంతో కదిలే ముంగిసను పాము కాటు వేటాయటానికి యత్నిస్తుంది.కానీ ముంగిస మాత్రం పాముకు ఆ ఛాన్స్ ఇవ్వదు. కన్నుమూసి తెరిచేలోగా తప్పించుకుంటుంది. కానీ ఒకవేళ పాముకాటు వేసినా ముంగిసకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. ఎందుకంటే పాముకాటు ద్వారా విషయం ముంగిస శరీరంలోకి ప్రవేశించినా..ఒక మోతాదు విషక్ష్ం వరకు ముంగిస దాన్ని ఇమ్యూన్ చేసుకోగలదు. ముంగిస శరీంలో అటువంటి శక్తి ఉంది. మిగతా జీవులతో పోలిస్తే జన్యుపరంగా ముంగిస శరీరంలో నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందట.

why snake and mongoose are enemy of each other reason may surprise you आखिर क्यों सांप और नेवले की दुश्मनी है? कारण जान जाएंगे तो हैरान होंगे

పాముకు చుక్కలు చూపించే ముంగిస..
పాము విషంలోని ఆల్ఫా-న్యూరోటాక్సిన్ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కండరాలు, నరాలను పనిచేయకుండా చేస్తాయి. దీంతో పాము కాటుకు గురయ్యే బాధితుడు పక్షవాతానికి గురికావడం లేదా చనిపోవడం జరుగుతుంది. ముంగిస శరీరంపై ఉండే ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు ఆల్ఫా-న్యూరోటాక్సిన్‌ను అడ్డుకుంటాయి. దానివల్ల పాము కాటేసినా..దానికి ఏమీ కాదు. అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కాటేసినా.. ముంగిసకు ఏమీ కాదు. కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుందని గుర్తించాలి. పాము పదే పదే కాటు వేస్తూ విషం మోతాదును పెరిగితే మాత్రం ముంగిసకైనా మరణం తప్పదు. కానీ మెరుపు వేగంతో మూవ్ అయ్యే ముంగిస పాము కాటు వేసే ఛాన్స్ ఇవ్వదు.పైగా చాలా తెలివిగా పోరాడుతుంది. వాటి కాళ్లకు ఉండే పదునైన గోళ్లతో పామును గాయపరుస్తుంది. పళ్లతో తలను పట్టుకుని చంపేస్తుంది. దీంతో పాము పలాయనం చిత్తగిస్తుంది.

హనీ బ్యాడ్జర్‌..
హనీ బ్యాడ్జర్‌. పాము కాటు వల్ల వీటికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే అది ఏ పాము అయినా శరీరంలో విషం వ్యాపించదు. హనీ బ్యాడ్జర్స్ పాముల్ని కూడా చంపి తినేస్తాయి. హనీ బ్యాడ్జర్ కు తేనె అంటే చాలా ఇష్టం. తేనె తుట్టెలు ఉండే ప్రాంతాల్లో వీటి సంచారం ఉంటుంది. తేనె టీగల లార్వాలను ఇష్టంగా తింటాయి. బలిష్టమైన శరీరం. పొట్టిగా ఉన్నా శక్తివంతమైన కాళ్ల నిర్మాణం వీటికి ప్లస్ పాయింట్స్. భూమిని తవ్వేసి చీమల్ని తినేస్తాయి. వాటి పంజాలు వాటిని మరో ప్లస్ పాయింట్ గా ఉంటాయి. హనీ బ్యాడ్జర్లు తల నుంచి తోక వరకు దట్టమైన బొచ్చును కలిగి ఉంటాయి. దీంతో పాము కాటు వేసినా శరీరంలోకి చొచ్చుకెళ్లదు. ఒకవేళ పాము కాటు ద్వారా విషయం శరీరంలోకి ప్రవేశించినా వీటికి ప్రాణాపాయం ఉండదట.

చెక్క ఎలుక
లుకల్లో చాలా రకలా జాతులుంటాయి. వీటిలో చెక్క ఎలుక ఒకటి. ఈ చెక్క ఎలుక, ఇది పాము విషం ద్వారా ఏమాత్రం ప్రభావితం కాదు. కానీ పాములకు ఈ ఎలుకలు ఆహారమైపోతుంటాయి. పెద్ద పాములు వీటిని గుటకాయస్వాహా చేస్తుంటాయి. దీంతో ఈ ఇవి పాములకు ఆమడదూరంలో ఉంటాయి. పాము అలికిడి వింటే తుర్రుమని పారిపోతాయి. బొరియాల్లో దాక్కుంటాయి.

Ground Squirrel

గ్రౌండ్ స్క్విరెల్కా : కాలిఫోర్నియా గ్రౌండ్ స్క్విరెల్ ఒక రకమైన ఉడుత. ఇది సాధారణంగా అమెరికాలోని చిన్న గడ్డి భూములు, చెట్లతో కప్పబడిన కొండలు, గ్రానైట్ రాళ్లలో కనిపిస్తుంది. పాము కాటు వల్ల ఇది కూడా ప్రభావితం కాదు.

పంది : పాము పందిని కరిచినా చావదు. పంది శరీరంలో న్యూరోటాక్సిన్ అనే ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది, ఇది పాము విషాన్ని పనిచేయకుండా చేస్తుంది. పాము విషాన్ని నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంది శరీరంపై పాము విషయం పనిచేయదు.కాబట్టి కి పాము కాటు వేసినా ప్రాణాపాయం కలుగదు.

పందికొక్కులాంటి ముళ్ల పంది : ఐరోపాలో కనిపంచే ముళ్లపందిని పాము కాటు వేసినా ఎటువంటి ప్రాణాపాయం కలుగదు. ఇది అచ్చంగా పందికొక్కులా కనిపించే ముళ్ల పంది.  చూడటానికి చిన్నగా కనిపించే ఈ జంతువులకు చాలా ధైర్యం ఎక్కువ. పాముకు ఏమాత్రం భయపడదు. దాని పని అది చేసుకుంటు పోతుంది. పాములు కనిపించినా భయపడదు. పాము విషం దానిపై ప్రభావం చూపదు. చూడటానికి ముద్దుగా బొద్దుగా భలే క్యూట్ గా ఉంటుంది.

కానీ మనుషులు మాత్రం పాముకాటుకు బలైపోతున్నారు. సరైన సమయంలో చికిత్స అందితే ప్రాణాల నుంచి గట్టెక్కొచ్చు. కానీ సరైన సమయంలో చికిత్స అందక పాముకాటుతో ఏడాదికి లక్షమందికి పైగా ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమని చెప్పాలి.