Nothing Phone 2a Plus : నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Nothing Phone 2a Plus : కొత్త లీక్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు, మెమరీ వేరియంట్‌లను వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన స్టాండర్డ్ ఫోన్ నథింగ్ 2ఎ మోడల్‌పై అప్‌గ్రేడ్‌లను వెల్లడించింది.

Nothing Phone 2a Plus : నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

Nothing Phone 2a Plus Specifications Leak ( Image Source : Google )

Updated On : July 27, 2024 / 7:25 PM IST

Nothing Phone 2a Plus : రాబోయే రోజుల్లో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నేతృత్వంలోని యూకే స్టార్టప్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను లాంచ్‌కు ముందే వెల్లడించింది. కొత్త లీక్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు, మెమరీ వేరియంట్‌లను వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన స్టాండర్డ్ ఫోన్ నథింగ్ 2ఎ మోడల్‌పై అప్‌గ్రేడ్‌లను వెల్లడించింది.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్పెసిఫికేషన్‌లు (లీక్) :
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి లేటెస్ట్ లీక్ వచ్చింది. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ ప్రామాణిక మోడల్‌లో 3 ముఖ్యమైన హార్డ్‌వేర్ మార్పులతో వస్తుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్‌లో 50ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా రానుంది. నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ 32ఎంపీ కెమెరాపై అప్‌గ్రేడ్ అందిస్తుంది. అయితే, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మారదు. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మోడల్ కూడా అదే 5,000mAh బ్యాటరీ, కొంచెం స్పీడ్ ఛార్జింగ్‌‌ వస్తుందని నివేదిక పేర్కొంది.

నథింగ్ ఫోన్ 2ఎ 45డబ్ల్యూ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేస్తుంది. అయితే, నథింగ్ ప్లస్ మోడల్ 50డబ్ల్యూతో కొంచెం వేగంగా ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ అదే 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్‌లకు సపోర్టుతో పాటు ఫోన్ నథింగ్ 2ఎ మాదిరిగా అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు.

రాబోయే నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ 12జీబీ వరకు ర్యామ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 7350 చిప్‌సెట్‌తో అందిస్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. నివేదిక ప్రకారం.. 8జీబీ+ 256జీబీ, 12జీబీ+ 256జీబీ ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్లలో గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. త్వరలో మడతబెట్టే ఐఫోన్లు వస్తున్నాయి.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ఎలా ఉండొచ్చుంటే?