Vangaveeti Radha Marriage: వంగవీటి రాధా వివాహానికి ముహూర్తం ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్ .. వివాహం ఎప్పుడంటే?

మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వంగవీటి రాధా - పుష్పవల్లి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vangaveeti Radha Marriage: వంగవీటి రాధా వివాహానికి ముహూర్తం ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్ .. వివాహం ఎప్పుడంటే?

Vangaveeti Radha Marriage

Vangaveeti Radha Krishna Marriage: మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వంగవీటి రాధా – పుష్పవల్లి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే వంగవీటి రాధాకు జక్కం పుష్పవల్లితో నిశ్చితార్ధం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె. ఆమె నరసాపురంలోనే చదువుకుంది. హైదరాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె కొంతకాలం యోగా టీచర్ గానూ పనిచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.

Read Also : Vangaveeti Radha Engagement : ఘనంగా వంగవీటి రాధ, జక్కం పుష్పవల్లి నిశ్చితార్థం

వంగవీటి రాధాకృష్ణ – పుష్పవల్లి వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుంది. ఇది పుష్పవల్లి తరుపున ప్రింట్ వేయించిన వెడ్డింగ్ కార్డుగా తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం.. అక్టోబర్ 22 (ఆదివారం) రాత్రి 7.59 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది. విజయవాడ – నిడమనూరు పోరంకి రోడ్డులోని మురళి రిసార్ట్స్ లో వివాహం జరగనుంది. వివాహ ఏర్పాట్లలో ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు నిమగ్నమయ్యారు. వంగవీటి రాధా వివాహం అంటే భారీ సంఖ్యలో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులుకూడా హాజరవుతారు. వీరికితోడు తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి కుటుంబానికి అభిమానులు ఎక్కువే. భారీ సంఖ్యలో అభిమానులు వంగవీటి రాధాకృష్ణ – పుష్పవల్లి వివాహానికి హాజరు కానున్నారు. దీంతో ఎవరికి ఇబ్బందిలేకుండా అన్నిరకాలుగా వివాహానికి వంగవీటి కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

Read Also : ODI World Cup 2023: తొలి పోరుకు సిద్ధమైన భారత్.. వారిద్దరికీ తుదిజట్టులో చోటు ఖాయమా? రోహిత్ ను ఊరిస్తున్న రికార్డులివే..

వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరినప్పటికీ.. ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, టీడీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. గతకొంతకాలంగా రాధా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే, ఇటీవల నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు.

 

Vangaveeti Radha Wedding Card

Vangaveeti Radha Wedding Card