ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి.. తెలంగాణలోనూ అలాంటి కోచింగ్ సెంటర్లను చూపిస్తా: రాజాసింగ్

ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురియడంతో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ భవనంలోని బేస్‌మెంట్లోకి..

ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి.. తెలంగాణలోనూ అలాంటి కోచింగ్ సెంటర్లను చూపిస్తా: రాజాసింగ్

Goshamahal MLA MLA Rajasingh

హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా అవినీతి కార్పొరేషన్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుంటూ అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురియడంతో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ భవనంలోని బేస్‌మెంట్లోకి నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన చాలా బాధాకరమని రాజా సింగ్ అన్నారు. అందులో తెలుగమ్మాయి కూడా ఉందని తెలిపారు. ఆమె కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు.

హైదరాబాద్‌లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని తెలిపారు. గోషామహల్లో అక్రమ నిర్మాణాలను తాను చూపిస్తానని చెప్పారు. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారని, కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. ఢిల్లీలో ప్రమాదాలు జరగకుండా తెలంగాణ ముఖ్యమంత్రి టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు.

Also Read: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ సెటైర్లు