Bandi Sanjay : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ సెటైర్లు

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తామని, డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని అన్నారు.

Bandi Sanjay : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ సెటైర్లు

Minister Bandi sanjay

Updated On : July 28, 2024 / 2:23 PM IST

CM Revnath Reddy : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం బోనాల సందర్భంగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పారు. నేను హిందువుల తరపున మాట్లాడినా వేరే మతానికి వ్యతిరేకం కాదని బండి సంజయ్ చెప్పారు.

Also Read : జగనన్న పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఏంటో తెలుసా? పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్బరుద్దీన్ ను కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తామని, డిప్యూటీ సీఎం చేస్తామని రేవంత్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తామని, డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లిలాంటిది. ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీ పక్కన చేరుతారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటారని సంజయ్ అన్నారు.