AP High Court : అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది.అంగళ్ల కేసులో చంద్రబాబుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

AP High Court : అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Chandrababu Anticipatory Bail

AP High Court Chandrababu Anticipatory Bail : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అంగళ్ల అల్లర్ల కేసులో A1గా ఉన్న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయటంతో ఊరట లభించింది.

కాగా గురువారం అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువైపుల వాదనలు విని తీర్పును వెలువరించకుండా రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని వెల్లడించింది. ఈక్రమంలో శుక్రవారం అయినా బెయిల్ వస్తుందా..? రాదా? అనే ఉత్కంఠకు ధర్మాసనం తీర్పుతో ఊరటనిచ్చింది.

కాగా.. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్ని సందర్శించేందుకు ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో పర్యటించారు. దీంట్లో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు మీదుగా వెళుతున్న సమయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

దీంట్లో చంద్రబాబు A1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పలువురికి బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత మరికొంతమందికి కూడా ఊరటనిస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈక్రమంలో ఇదే కేసులో చంద్రబాబుకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో కాస్త ఊరట లభించినట్లైంది.

Also Read: ఏపీ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్

ఇదిలా ఉంటే..ఏసీబీ కోర్టులో చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డ్ ఇవ్వాలంటు పిటిషన్ దాఖలు చేసారు చంద్రబాబు తరుపున న్యాయవాదులు. ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఈ కేసును అక్టోబర్ (2023) 18కు వాయిదా వేశారు.