AP High Court : ఏపీ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాజేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.

AP High Court : ఏపీ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్

ap high court

ap high court Kilaru Rajesh anticipatory bail petition : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను అరెస్ట్ చేస్తారనే భయంతో రాజేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిపోర్టులో కిలారు రాజేశ్ పేరు కూడా సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కిలారు రాజేష్ దాఖలు చేసిన పిటీషన్ పై ఈరోజు విచారణకు వచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేష్ పేరును పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న చంద్రబాబుకు బెయిల్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో రాజేష్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజేష్ కీలకంగా వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుని సీఐడీ అధికారులు రెండు రోజులు విచారించారు. ఇదే కేసులో నిందితుడగా ఉన్న కిలారా రాజేష్ ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో స్కామ్ జరిగిందనే ఆరోపణలతో చంద్రబాబును సీఐడీ అధికారులు సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ కేసు విషయంలో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు కావటంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్ పీపై ఈరోజు మధ్యాహ్నాం 2.00గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ఇవాళ సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించే అవకాశం ఉంది. మరి అవినీతి నిరోధక ట్టం సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా..? లేదా అనేది తేలాల్సి ఉంది. మరి ఈ సెక్షన్ 17ఏ పై సుప్రీంకోర్టు ఏం తేల్చనుందో వేచి చూడాలి.