Telangana Congress: మొదటి జాబితాలో టికెట్ దక్కించుకున్నమహిళా అభ్యర్థులు వీరే..
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో ఆరుగురు మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.
Congress Candidates 1st List : తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలి విడతలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. అయితే, తొలి విడత జాబితాలో ఆరుగురు మహిళ అభ్యర్థులకు అవకాశం దక్కింది.
తొలి జాబితాలో మహిళా నేతలు..
1. ములుగు – సీతక్క
2. సనత్ నగర్ – కోట నీలిమ
3. గోషామహల్ – మొగిలి సునీత
4. గద్వాల్ – సరిత తిరుపతయ్య
5. కోదాడ – పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి
6. స్టేషన్ ఘన్ పూర్ – సింగాపురం ఇందిర
మొదటి జాబితాలో మైనారిటీలు
1. మలక్ పేట – షేక్ అక్బర్
2. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
3. కార్వాన్ – ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ