Btech Ravi Arrest : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్.. ఆందోళనలో కుటుంబసభ్యులు, పార్టీ నేతలు

Police Arrest Btech Ravi : బీటెక్ రవి అరెస్ట్ తో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Btech Ravi Arrest : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్.. ఆందోళనలో కుటుంబసభ్యులు, పార్టీ నేతలు

Btech Ravi Arrest

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీకెట్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల నుంచి కడపకు వస్తుండగా యోగివేమన యూనివర్సిటీ సమీపంలో కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అదృశ్యంపై అటు కుటుంబసభ్యులు, ఇటు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారా? లేక పోలీసులు అరెస్ట్ చేశారా? అర్థం కాని పరిస్థితి ఉందని వాపోయారు.

అందుబాటులోకి రాని పోలీసు ఉన్నతాధికారులు..
విషయం తెలిసిన వెంటనే కడప జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ లో కాంటాక్ట్ చేసేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రయత్నం చేశారు. అయితే, అచ్చెన్నాయుడు ఫోన్ కాల్స్ ని పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ ఆన్సర్ చేయడం లేదని టీడీపీ నేతలు వెల్లడించారు. బీటెక్ రవి అరెస్ట్ తో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఆ రూ.27కోట్లు ఎక్కడివి? టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు.. ఏం జరగనుంది

సినీ ఫక్కీలో అరెస్ట్
బీటెక్ రవిని పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నుంచి ఆయన కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు పులివెందుల నుంచి కడపకు వస్తున్న సమయంలో కొంపర్తి ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలోకి రాగానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రవితో పాటు డ్రైవర్, గన్ మెన్లను కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బీటెక్ రవిని ఎందుకు అరెస్ట్ చేశారంటే..
గతంలో నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో తనను ఎయిర్ పోర్టుకు అనుమతించ లేదంటూ అటు అధికారులపైనా, ఇటు పోలీసులపైనా బీటెక్ రవి చాలా దురుసుగా ప్రవర్తించారని అప్పట్లో వల్లూరులో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంటూ వచ్చింది. ఈ కేసుని ఇంతకాలం ఎందుకు పెండింగ్ లో ఉంచారు, వెంటనే క్లియర్ చేయండి అని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇవాళ బీటెక్ రవిని వల్లూరు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : హైదరాబాద్ లో ప్రధాని మోదీ ప్రసంగం నాకు నచ్చలేదు.. ఆయన మాటలకు బాధపడ్డా

అనంతరం వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత బీటెక్ రవి గన్ మెన్లను, కారు డ్రైవర్ ని పంపేశారు. బీటెక్ రవిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం బీటెక్ రవిని కోర్టులో హాజరుపరుస్తారా? లేక రేపు(నవంబర్ 15) ఉదయం ప్రవేశపెడతారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.