AUS vs PAK: గెల‌వ‌డ‌మే మ‌రిచిపోయిన పాకిస్తాన్..! 1999 నుంచి వ‌రుస‌గా 16వ టెస్టు మ్యాచులో ఓట‌మి..

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో పాకిస్తాన్‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. వ‌రుస‌గా రెండో టెస్టు మ్యాచులోనూ ఓడిపోయింది

AUS vs PAK: గెల‌వ‌డ‌మే మ‌రిచిపోయిన పాకిస్తాన్..! 1999 నుంచి వ‌రుస‌గా 16వ టెస్టు మ్యాచులో ఓట‌మి..

Pakistan

Australia v Pakistan : ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో పాకిస్తాన్‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. వ‌రుస‌గా రెండో టెస్టు మ్యాచులోనూ ఓడిపోయింది. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో 79 ప‌రుగుల తేడాతో ఓడింది. దీంతో మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఆసీస్‌కు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 318 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత పాకిస్తాన్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 264 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

దీంతో ఆసీస్‌కు కీల‌క‌మైన 54 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 262 ప‌రుగులకు ఆలౌట్ కావ‌డంతో పాకిస్తాన్ ముందు 317 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యం నిలిచింది. అయితే పాక్ 237 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆస్ట్రేలియా 79 ప‌రుగుల‌తో గెలిచింది.

Team India : ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్‌కు ఐసీసీ షాక్‌.. ద‌క్షిణాఫ్రికా అదృష్టం మామూలుగా లేదుగా..!

కాగా.. 1999 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా దేశంలో ఆసీస్ పై ఒక్క‌సారి కూడా పాకిస్తాన్ గెల‌వ‌లేదు. చివ‌రి సారి 1995లో కంగారుల‌పై మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచ్ త‌రువాత నుంచి నేటి మ్యాచ్ వ‌ర‌కు 16 టెస్టులు ఆడిన పాకిస్తాన్ ఒక్క‌దానిలోనూ విజ‌యం సాధించ‌లేదు.

1999 నుంచి పాకిస్తాన్ ప‌రాజ‌యాల జాబితా..

– బ్రిస్బేన్ వేదిక‌గా 5 నవంబర్ 1999 – 10 వికెట్లు
– హోబర్ట్ వేదిక‌గా 18 నవంబర్ 1999 – 4 వికెట్లు
– పెర్త్ వేదిక‌గా 26 నవంబర్ 1999 – ఇన్నింగ్స్ 20 ప‌రుగులు
– పెర్త్ వేదిక‌గా 16 డిసెంబర్ 2004 – 491 పరుగులు
– మెల్‌బోర్న్ వేదిక‌గా 26 డిసెంబర్ 2004 – 9 వికెట్లు
– సిడ్నీ వేదిక‌గా 2 జనవరి 2005 – 9 వికెట్లు
– మెల్‌బోర్న్ వేదిక‌గా 26 డిసెంబర్ 2009 – 170 పరుగులు
– సిడ్నీ వేదిక‌గా 3 జనవరి 2010 – 36 పరుగులు
– హోబర్ట్ వేదిక‌గా 14 జనవరి 2010- 231 పరుగులు
– బ్రిస్బేన్ వేదిక‌గా 15 డిసెంబర్ 2016 – 39 పరుగులు
– మెల్‌బోర్న్ వేదిక‌గా 26 డిసెంబర్ 2016 – ఇన్నింగ్స్ 18 ప‌రుగులు
– సిడ్నీ వేదిక‌గా 3 జనవరి 2017 – 220 పరుగులు
– బ్రిస్బేన్ వేదిక‌గా 21 నవంబర్ 2019 – ఇన్నింగ్స్ 5 ప‌రుగులు
– అడిలైడ్ వేదిక‌గా 29 నవంబర్ 2019 – ఇన్నింగ్స్ 48 ప‌రుగులు
– పెర్త్ వేదిక‌గా 14 డిసెంబర్ 2023 – 360 ప‌రుగులు
– మెల్‌బోర్న్ వేదిక‌గా 26 డిసెంబర్ 2023 – 79 పరుగులు

Virat Kohli: 146 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి.. కోహ్లీకే ఈ రికార్డు సొంతం