Virat Kohli: 146 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి.. కోహ్లీకే ఈ రికార్డు సొంతం

Virat Kohli: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. నిన్న జరిగిన మ్యాచుతో..

Virat Kohli: 146 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి.. కోహ్లీకే ఈ రికార్డు సొంతం

Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత ఏడాది కోహ్లీ 2,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇంతకు ముందు ఆరు క్యాలెండర్ ఇయర్స్‌లో కోహ్లీ 2,000 కంటే ఎక్కువ పరుగుల చొప్పున బాదాడు. నిన్నటితో.. మొత్తం ఏడు క్యాలెండర్ ఇయర్స్‌లో 2,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

అధికారిక రికార్డుల ప్రకారం ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1877లో జరిగింది. 146 ఏళ్ల నుంచి నిన్నటివరకు ఏడు క్యాలెండర్ ఇయర్స్‌లో 2,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు లేడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరా 2,000 పరుగులను ఆరు పర్యాయాలు బాదాడు. సంగక్కరా రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

కోహ్లీ ఏయే ఏడాది 2,000 ప్లస్ పరుగులు బాదాడు?
2012లో 2186 పరుగులు
2014లో 2286
2016లో 2595
2017లో 2818
2018లో 2735
2019లో 2455
2023లో 2048

South Africa vs India: భారత్‌పై సౌతాఫ్రికా ఘన విజయం.. ఏ మాత్రం రాణించలేకపోయిన భారత బ్యాటర్లు