AP Anganwadi Workers : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తొలగింపును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

అంగన్వాడీలు ప్రభుత్వంపై చేస్తున్న సమ్మె విరమించడంతో టెర్మినల్ చేస్తూ వచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

AP Anganwadi Workers : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తొలగింపును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

Anganwadi Workers

AP Government : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 41రోజులుగా ఏపీలోని అంగన్వాడీలు సమ్మె బాటపట్టిన విషయం విధితమే. అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలం కాకపోవటంతో అంగన్వాడీలు ఆందోళన ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. సమ్మెలో పాల్గొన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారంకు హామీ ఇవ్వడంతో చర్చలు సఫలం అయ్యాయి. దీంతో అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : Botsa Satyanarayana : అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. సమ్మె విరమణ.. నేటి నుంచి విధుల్లోకి

ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలంకావడంతో అంగన్వాడీ వర్కర్లు సమ్మెను విరమించి మంగళవారం నుంచి విధుల్లో చేరారు. గతంలో జరిపిన చర్చలు విఫలం కావడం, అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేయడంతో.. ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది.. అయినా, అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల వారీగా అంగన్వాడీలను తొలగిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులుసైతం జారీ చేశారు. సోమవారం రాత్రి చర్చలు సఫలం కావడం, అంగన్వాడీలు సమ్మెను విరమించడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తొలగింపును వెనక్కి తీసుకుంది. ప్రభుత్వంపై చేస్తున్న సమ్మె విరమించడంతో టెర్మినల్ చేస్తూ వచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. మంగళవారం ఉదయం కేంద్రాల్లో విధుల్లో హాజరు కావాలని ఆదేశించింది.

Also Read : YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్.. నేటి నుంచి జిల్లాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే

సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. రెండు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరపగా ఫలించాయి. ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందుంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు అంగీకరించారు. దీంతో ప్రభుత్వం, అంగన్వాడీల మధ్య చర్చలు సఫలం అయ్యాయి. మంగళవారం నుంచి అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు.