Ladakh : చైనా సైనికుల‌కు దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్పిన గొర్రెల కాప‌రులు.. నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకున్న వీడియో

భార‌త్‌, చైనా వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ (LAC) వ‌ద్ద గత కొన్నాళ్లుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Ladakh : చైనా సైనికుల‌కు దిమ్మ‌దిరిగే స‌మాధానం చెప్పిన గొర్రెల కాప‌రులు.. నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకున్న వీడియో

Ladakh shepherds confront Chinese soldiers who tried to stop sheep grazing

Ladakh shepherds : భార‌త్‌, చైనా వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ (LAC) వ‌ద్ద గత కొన్నాళ్లుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 2020 గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌రువాత అక్క‌డి ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎల్ఏసీ వ‌ద్ద గొర్రెల‌ను మేపేందుకు కాప‌రులు బృందం వెళ్ల‌గా వారిని చైనా సైనికులు అడ్డుకున్నారు. ఇక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని చైనా సైనికులు చెప్ప‌గా వారిని కాప‌రుల బృందం ధైర్యంగా ఎదుర్కొంది. తాము భార‌త భూ భాగంలో ఉన్నామ‌ని చాలా గట్టిగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది నెటిజ‌న్ల మ‌న‌సుల‌ను గెలుచుకుంది.

గాల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌రువాత ఎల్ఏసీ ప్రాంతాల్లో జంతువును మేప‌డం కాప‌రులు మానేశారు. అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ త‌మ‌ గొర్రెల‌ను మేపేందుకు అక్కడికి వెలుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు చైనా సైనికులు గొర్రెల కాప‌రుల బృందాన్ని అడ్డ‌గించింది. అక్క‌డి నుంచి వెళ్లాల‌ని చైనా సైనికులు చెప్ప‌గా కాప‌రులు వారితో వాదించారు. ఇది మా భూభాగం. తాము త‌మ హ‌క్కుల‌ను వాడుకుంటున్నామ‌ని చాలా గ‌ట్టిగా చెప్పారు. ఇక్క‌డి నుంచి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. గొర్రెల కాప‌రుల బృందం ధైర్యాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు. కాగా.. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రి ప్రారంభంలో జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

Maldives : మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం! సంత‌కాల సేక‌ర‌ణ పూర్తి!

ఈ వీడియోలో క‌నీసం మూడు చైనీస్ సాయుధ వాహ‌నాలు క‌నిపిస్తున్నాయి. అనేక మంది సైనికుల‌ను చూడొచ్చు. వారు అలారం మోగిస్తూ గొర్రెల కాప‌రులను అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని చెప్ప‌డం క‌నిపిస్తుంది. అయితే.. కాపరుల బృందం భార‌త భూభాగంలోనే ఉన్నామ‌ని, అక్క‌డి నుంచి వెళ్లేది లేద‌ని తేల్చి చెప్పారు. వాగ్వాదం ముదర‌డంతో కొంద‌రు గొర్రెల కాప‌రులు రాళ్లు తీయ‌డం క‌నిపించింది. అయితే.. వీడియోలో హింస చెల‌రేగిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

 

View this post on Instagram

 

A post shared by Kunsang Namgyal (@kunsangnamjal)