Alligator Viral : మీరు అసలు తల్లిదండ్రులేనా.. ఎలిగేటర్‌‌తో ఫోజులా..? పిల్లల ప్రాణాలతో చెలగాటాలా?

Alligator Viral : వాస్తవానికి గత సంవత్సరం టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ ఫుటేజ్‌లో పెద్దలు తమ ఇద్దరు యువతులను భారీ మొసలికి దగ్గరగా నిలబడమని కోరడాన్ని చూడవచ్చు.

Alligator Viral : మీరు అసలు తల్లిదండ్రులేనా.. ఎలిగేటర్‌‌తో ఫోజులా..? పిల్లల ప్రాణాలతో చెలగాటాలా?

Parents Make Their Children Pose ( Image Source : Google )

Alligator Viral : మొసలి.. అదే ఎలిగేటర్.. దూరంగా కనిపిస్తేనే భయంగా అనిపిస్తుంది. అలాంటిది పక్కన నిలబడి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. పిల్లలకు రక్షణ కల్పించాల్సిన తల్లిదండ్రులే వారి ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. మొసలితో కలిసి ఫోటోలకు పోజులివ్వమని తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా ప్రోత్సహిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అనేక రకాల వన్యప్రాణులకు నిలయమైన ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.

Read Also : Viral Video: ఇంత నిర్లక్ష్యమా? కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని కారు డ్రైవింగ్ చేసిన తండ్రి

వాస్తవానికి గత సంవత్సరం టిక్‌టాక్‌లో షేర్ చేసిన ఈ ఫుటేజ్‌లో పెద్దలు తమ ఇద్దరు యువతులను భారీ మొసలికి దగ్గరగా నిలబడమని కోరడాన్ని చూడవచ్చు. ఆ అమ్మాయిలు మొసలి పక్కనే నిలబడేందుకు భయంతో సంకోచంగా కనిపిస్తున్నారు. అయినప్పటికీ పెద్దలు వారి భయాందోళను పట్టించుకోలేదు. ఇంతలో ఎలిగేటర్ రోడ్డు పక్కన నోరు తెరిచి ఉంది. మరో యువతి కూడా అక్కడే ఫొటోలకు పోజులిచ్చి ప్రమాదం గురించి పట్టించుకోనట్లు కనిపిస్తుంది. ఆమెతో మరో ఫోటో కోసం పిల్లవాడిని పిలవడాన్ని చూడవచ్చు.

ప్రమాదం అని తెలిసి కూడా ఇలా ప్రాణాలను రిస్క్‌లో పెడతారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ”అది మంచి ఆలోచన అని అనుకోకండి” అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీడియో క్యాప్షన్ ఇచ్చింది. బాధ్యతారహితమైన ప్రవర్తనతో పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై నెటిజన్లలో ఆందోళనను రేకెత్తించింది. పిల్లల శ్రేయస్సు కన్నా ఫొటోలకే ప్రాధాన్యత ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పిల్లవాడు ఎలిగేటర్‌కు దూరంగా ఉండటానికి ఎలా పోరాడుతున్నాడో చూడండి.. అయినా అతడి తల్లి డేంజర్ జోన్‌లోకి నెట్టివేస్తుందని మరో యూజర్ విమర్శించాడు.

పిల్లలను ఎలిగేటర్‌తో ఇలా ఆటలాడించడం తల్లిదండ్రులదే తప్పు అని యూజర్ నిందించాడు. ఎలిగేటర్లు నీటిలో, భూమిపై ఎంత వేగంగా ఉంటాయో ప్రజలు అర్థం చేసుకోలేరని కామెంట్ చేశాడు. తల్లిదండ్రులు ఇలాంటి చర్యలను ఎలా అనుమతిస్తారు.. చూస్తుంటే చాలా కోపం తెప్పిస్తోందని మరో యూజర్ కామెంట్ చేశాడు. వైల్డ్ ఫ్లోరిడా ప్రకారం.. ఎలిగేటర్లు తక్కువ దూరాలలో వేగంగా దూసుకుపోగలవు. భూమిపై గంటకు 35 మైళ్ల వరకు చేరుకోగలవు.

 

View this post on Instagram

 

A post shared by Influencers in the Wild (@influencersinthewild)

Read Also : Viral Video : నువ్వు సూపర్ అక్కా.. పామును మహిళ ధైర్యంగా ఎలా చేతులతో పట్టుకుందో చూశారా? వీడియో వైరల్!