Viral Pic: వరదల్లోనూ మద్యం తాగుతూ వీరి పని వీరు కానిచ్చేసి..
నీళ్లు అంతగా భవనంలోకి వచ్చినప్పటికీ జర్నలిస్టులు అదేమీ పట్టనట్లుగా..

ఢిల్లీలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే సమయంలో అక్కడి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా భవనంలోనూ నీరు చేరాయి.
అయితే, ఆ నీటిలోనే కుర్చీలపై కూర్చొని జర్నలిస్టులు హాయిగా మద్యం తాగి, స్నాక్స్ తిన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయిన. హిందుస్థాన్ వార్తా పత్రిక జర్నలిస్ట్ హేమంత్ రాజౌరా ఈ ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఇది ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని సీన్ అని పేర్కొన్నారు.
నీళ్లు అంతగా భవనంలోకి వచ్చినప్పటికీ జర్నలిస్టులు అదేమీ పట్టనట్లుగా తమ పని తాము కానిచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచం మునిగిపోయినా తమ పని మాత్రం ఆగకూడదన్న భావన వారిలో ఉన్నట్లుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మద్యం అంతగా తాగాలని అనిపిస్తే నీళ్లు లేని చోటుకి తాగొచ్చు కదా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
This is the scene of The press club of India in Delhi 5 pic.twitter.com/ZMNFKJmTfG
— Hemant Rajaura (@hemantrajora_) July 31, 2024
Also Read: నన్ను చూసేందుకు ఎవరూ ఇక్కడకు రావద్దు: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి