Kinetic E-Luna Scooter : కైనెటిక్ గ్రీన్ నుంచి సరికొత్త ‘ఇ-లూనా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 110 కిలోమీటర్ల రేంజ్..

Kinetic E-Luna Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఇ-లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

Kinetic E-Luna Scooter : కైనెటిక్ గ్రీన్ నుంచి సరికొత్త ‘ఇ-లూనా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 110 కిలోమీటర్ల రేంజ్..

Kinetic E-Luna Scooter launched in India at Rs 69,990

Kinetic E-Luna Scooter : భారత మార్కెట్లోకి ప్రముఖ టూ-వీలర్ తయారీదారు కైనెటిక్ గ్రీన్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ లూనా స్కూటర్ వచ్చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఇ-లూనా రూ. 69,990 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇదివరకే, లూనా స్కూటర్ కొనుగోలు కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు 40వేల మంది కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు నమోదైనట్టు కంపెనీ తెలిపింది. ప్రత్యేకించి పట్టణ, గ్రామీణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కైనెటిక్ గ్రీన్ లక్ష యూనిట్ల ఇ-లూనా స్కూటర్లను విక్రయించాలని భావిస్తోంది. దీని మొత్తం ఖర్చు నెలకు రూ. 2,500 కన్నా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Honda NX500 Bike Launch : కొత్త బైక్ కొంటున్నారా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా NX500 అడ్వెంచర్ బైక్.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?

గంటకు 50కి.మీ టాప్ స్పీడ్ :
150కిలోల పేలోడ్ కెపాసిటీ కలిగిన ఇ-లూనా పూర్తిగా స్వదేశంలోనే ఇంజినీరింగ్ డిజైన్ చేసినట్టు కైనెటిక్ గ్రీన్ వెల్లడించింది. ఇ-లూనాలో ఐపీ67-రేటెడ్ 2kWh లిథియం-అయాన్ బ్యాటరీతో 2.2కేడబ్ల్యూ (BLDC) మిడ్-మౌంట్ మోటారు ఉంది. ఎలక్ట్రిక్ టూ వీలర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీతో స్వాప్ చేసుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఇ-లూనా స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పెడితే చాలు.. 110 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గరిష్టంగా గంటకు 50కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీని నాలుగు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో ఇ-లూనా 1.7kWh, 3.0kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Kinetic E-Luna Scooter launched in India at Rs 69,990

Kinetic E-Luna Scooter

ఇ-లూనా డ్యూయల్-ట్యూబ్యులర్, హై-స్ట్రెంగ్త్ స్టీల్ ఫ్రేమ్ ఆధారంగా పనిచేస్తుంది. 16-అంగుళాల వెడల్పు కలిగిన వీల్స్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు కూడా ఉన్నాయి. అంతేకాదు.. కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇ-లూనా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో (CAN) ఎనేబుల్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌ను కలిగి ఉంది. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, 3 రైడింగ్ మోడ్‌లు, డిటాచబుల్ రియర్‌సీట్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

మొత్తం 5 కలర్ ఆప్షన్లలో :
వంద శాతం మేడ్-ఇన్-ఇండియాతో భారతీయ వినియోగదారుల కోసం ఇ-లూనా రూపొందించినట్టు కైనెటిక్ గ్రూప్ చైర్మన్ అరుణ్ ఫిరోడియా పేర్కొన్నారు. ఇ-లూనా స్కూటర్ మొత్తం మల్బరీ రెడ్, పెర్ల్ ఎల్లో, నైట్ స్టార్ బ్లాక్, ఓషన్ బ్లూ, స్పార్క్లింగ్ గ్రీన్ అనే 5 కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. అంతేకాదు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉండనుంది.

Read Also : Bajaj Chetak electric scooter : 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్.. ధర, వేరియంట్లు, ఫీచర్లు పూర్తివివరాలివే..