BMW M 1000 XR Launch : అద్భుతమైన ఫీచర్లతో బీఎండబ్ల్యూ M 1000 ఎక్స్ఆర్ బైక్, 278కి.మీ టాప్ స్పీడ్.. భారత్‌లో ధర ఎంతంటే?

BMW M 1000 XR Launch : బీఎండబ్ల్యూ ఎక్స్ 1000 డెలివరీలు జూన్ 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

BMW M 1000 XR Launch : అద్భుతమైన ఫీచర్లతో బీఎండబ్ల్యూ M 1000 ఎక్స్ఆర్ బైక్, 278కి.మీ టాప్ స్పీడ్.. భారత్‌లో ధర ఎంతంటే?

BMW M 1000 XR launched in India ( Image Credit : Google )

BMW M 1000 XR Launch : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త బీఎండబ్ల్యూ M 1000XR బైక్ వచ్చేసింది. ప్రముఖ బీఎండబ్ల్యూ మోటోర్‌రాడ్ ఇండియా భారత మార్కెట్లో ఎమ్1000 ఎక్స్ఆర్ రూ. 45 లక్షల ధరకు (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా వచ్చింది.

Read Also : TVS iQube e-scooter : కొత్త వేరియంట్లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

జూన్ 24 నుంచి డెలివరీలు :
బీఎండబ్ల్యూ ఎక్స్ 1000 డెలివరీలు జూన్ 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ 999సీసీ, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ మోటార్‌తో 201బీహెచ్‌పీ, 113ఎన్ఎమ్ గరిష్ట శక్తిని టార్క్ అందిస్తుంది. ఎమ్ 1000 ఆర్ఆర్ కొన్ని మార్పులు చేసినప్పటికీ అదే ఇంజన్ కలిగి ఉంది. ఇంజన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఎమ్ 1000 ఎక్స్ఆర్ అడ్వెంచర్ టూరర్ గంటకు 0 నుంచి 100కిలోమీటర్ల స్ప్రింట్‌ను కేవలం 3.2 సెకన్లలో చేయగలదు. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇంకా, ఐదు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. అందులో రెయిన్, రోడ్, డైనమిక్, రేస్, రేస్ ప్రో ఉన్నాయి.

సిక్స్-యాక్సిస్ సెన్సార్ బాక్స్‌తో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ డీటీసీ, డీటీసీ వీలీ ఫంక్షన్ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఎమ్ ఎక్స్ఆర్ లాంచ్ కంట్రోల్, పిట్-లేన్ లిమిటర్, 6.5-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, హీటెడ్ గ్రిప్‌లు, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, టీపీఎమ్ఎస్, ఎల్ఈడీ లైట్లు వంటి గూడీస్‌ను కూడా కలిగి ఉంటాయి.

బ్రేకింగ్ డ్యూటీలు ముందువైపు ట్విన్ 320ఎమ్ఎమ్ డిస్క్‌లు, వెనుకవైపు 265ఎమ్ఎమ్ డిస్క్ ఉంటాయి. ఎమ్ 1000 ఎక్స్ఆర్ 10 ఫేస్ అడ్జెస్ట్, బ్యాక్ సైడ్ ఎడ్జెస్ట్ చేయగల మోనోషాక్‌తో 45ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్‌ కలిగి ఉంది. భారత్‌లో ఎమ్ ఎక్స్ఆర్ ఎమ్ కాంపిటీషన్ ప్యాకేజీతో వస్తుంది.

కార్బన్ చక్రాలు, అడ్జెస్ట్ చేసేలా ఫుట్‌రెస్ట్‌లు వంటి ఎమ్-నిర్దిష్ట గేర్‌తో వస్తుంది. ఈ టెక్నాలజీ అంతా ఎమ్ ఎక్స్ఆర్ 3కిలోగ్రామలు తేలికగా ఉంటుంది. ఎమ్ 1000 ఎక్స్ఆర్ కార్బన్ ఫైబర్ సైడ్ ప్యానెల్స్‌తో పాటు ఫ్రంట్, బ్యాక్ మడ్‌గార్డ్‌లతో కేవలం బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ పెయింట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది.

Read Also : Moto Morini X-Cape : కొత్త బైకు కొంటున్నారా? ఈ అడ్వెంచర్ బైకు ధరలు భారీగా తగ్గాయి..!