ప్లాట్‌ఫాం ఫీజులను పెంచేసిన జొమాటో, స్విగ్గీ.. ఆ యాప్‌లలో ఆర్డర్లు తగ్గించేశానన్న క్యాపిటల్‌మైండ్ సీఈవో

ఢిల్లీ, బెంగళూరే కాదు ముంబై, హైదరాబాద్‌, లక్నోల్లోనూ ఈ ధరలు వర్తిస్తాయి.

ప్లాట్‌ఫాం ఫీజులను పెంచేసిన జొమాటో, స్విగ్గీ.. ఆ యాప్‌లలో ఆర్డర్లు తగ్గించేశానన్న క్యాపిటల్‌మైండ్ సీఈవో

Swiggy, Zomato

హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకోవడానికి చాలా మంది ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలను వాడుతున్నారు. తాజాగా, ఆ యాప్‌లు ప్లాట్‌ఫాం ఫీజులను పెంచడంతో కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాగా డిమాండ్ ఉండే ఢిల్లీ, బెంగళూరులాంటి సిటీల్లో రూ.20 శాతం పెంచి ప్లాట్‌ఫాం ఫీజు (రూ.6) తీసుకుంటున్నాయి.

ఇంతకుముందు అది రూ.5గా ఉండేది. ఆయా సంస్థలు ప్లాట్‌ఫాం ఫీజును గత ఏడాది తీసుకొచ్చాయి. అప్పట్లో రూ.2 ప్లాట్‌ఫాం ఫీజు విధించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జొమాటో కంపెనీ ఆ ఫీజును 25 శాతం (రూ.5కి) పెంచింది. ఢిల్లీ, బెంగళూరే కాదు ముంబై, హైదరాబాద్‌, లక్నోల్లోనూ ఈ ధరలు వర్తిస్తాయి.

దీనిపై జొమాటో, స్విగ్గీ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్‌ఫాం ఫీజుల వసూళ్లపై బెంగళూరుకు చెందిన కంపెనీ క్యాపిటల్‌మైండ్ సీఈఓ దీపక్ షెనాయ్ స్పందిస్తూ.. ఛార్జీలు ఎక్కువగా విధిస్తున్న కారణంగా స్విగ్గీ, జొమాటో యాప్‌ల వినియోగాన్ని బాగా తగ్గించేస్తున్నానని పేర్కొన్నారు.

వీకెండ్‌లో ఒకే ఒక్కసారి ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. ప్లాట్‌ఫాం ఫీజు ఇప్పుడు రూ.6 ఉండడాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రతిరోజు ఆర్డర్ ఇచ్చే అలవాటును వదిలేస్తున్నానని తెలిపారు. వారు రెస్టారెంట్ల నుంచి కూడా 30 శాతం తీసుకుంటారని చెప్పారు.

Also Read: లోకల్ ట్రైన్‌లో గానామృతధారలు కురిపించిన ప్రయాణికుడు