Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధర ఎంతో తెలుసా.. భారీగా తగ్గిన వెండి ధర..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
![Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధర ఎంతో తెలుసా.. భారీగా తగ్గిన వెండి ధర.. Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధర ఎంతో తెలుసా.. భారీగా తగ్గిన వెండి ధర..](https://10tv.in/wp-content/uploads/2024/07/Gold-And-Silver-Price-Today-8.jpg)
Gold And Silver Price Today
Gold and Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర మంగళవారం పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ పై రూ. 380 పెరిగింది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 200 తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా నమోదైన బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.74,020. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,000 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,170.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,850 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,020.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,510కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 99,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.99,500.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 95,000 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.95,000.
బెంగళూరులో కిలో వెండిపై రూ. 950 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 94,250 వద్దకు చేరింది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.