TVS Apache RTR 160 : కొత్త బైక్ చూశారా? టీవీఎస్ అపాచీ RTR 160 రేసింగ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
2024 TVS Apache RTR 160 Launch : ఈ మోటార్‌సైకిల్ బజాజ్ పల్సర్ ఎన్160, హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్, హోండా ఎస్పీ160 వంటి వాటికి పోటీగా మార్కెట్లోకి వచ్చింది.
![TVS Apache RTR 160 : కొత్త బైక్ చూశారా? టీవీఎస్ అపాచీ RTR 160 రేసింగ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా? TVS Apache RTR 160 : కొత్త బైక్ చూశారా? టీవీఎస్ అపాచీ RTR 160 రేసింగ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2024/07/2024-TVS-Apache-RTR-160-Racing-Edition-launched-in-India-at-Rs-128720.jpg)
2024 TVS Apache RTR 160 Racing Edition launched ( Image Source : Google)
2024 TVS Apache RTR 160 Launch : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ నుంచి 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ బైకు ధర రూ. 1,28,720 (ఎక్స్-షోరూమ్)కు లభ్యమవుతుంది.
Read Also : Lava Blaze X 5G Launch : అదిరే ఫీచర్లతో లావా బ్లేజ్ X 5జీ ఫోన్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?
ఈ మోటార్‌సైకిల్ బజాజ్ పల్సర్ ఎన్160, హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్, హోండా ఎస్పీ160 వంటి వాటికి పోటీగా మార్కెట్లోకి వచ్చింది. 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ కార్బన్ ఫైబర్ రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, రేసింగ్ ఎడిషన్ లోగో, రెడ్ అల్లాయ్ వీల్స్‌తో ప్రత్యేకమైన మ్యాట్ బ్లాక్ కలర్ స్కీమ్‌లో వస్తుంది.
టీవీఎస్ అపాచీ స్పెషిఫికేషన్లు :
ఈ మోటార్‌సైకిల్ 159.7సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంది. 16.04పీఎస్ గరిష్ట శక్తిని 13.85ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. డబుల్ క్రెడిల్ సింక్రొనైజ్డ్ స్టిఫ్ ఛాసిస్ ఆధారంగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు 5-దశల ఎడ్జెస్ట్ చేయగల షాక్‌లను కలిగి ఉంది. ట్యూబ్‌లెస్ టైర్లతో 17-అంగుళాలు ఉంటుంది. బ్రేకింగ్ వేరియంట్ ఆధారంగా 270ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ 200ఎమ్ఎమ్ డిస్క్/130ఎమ్ఎమ్ డ్రమ్ ద్వారా అందిస్తుంది.
టీవీఎస్ 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌లో 3 రైడ్ మోడ్లు (స్పోర్ట్, అర్బన్ రెయిన్), టీవీఎస్ స్మార్ట్ ఎక్సోనెక్ట్ డిజిటల్ ఎల్సీడీ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ల్యాంప్, జీటీటీ (గ్లైడ్ త్రూ టెక్నాలజీ) వంటి ఫీచర్లను అందిస్తుంది. టీవీఎస్ స్మార్ట్ (SmartXonnect) టెక్నాలజీ వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, రేస్ టెలిమెట్రీతో బ్లూటూత్‌ను అందిస్తుంది.
Read Also : JioTag Air Tracker : భారతీయ యూజర్ల కోసం జియోట్యాగ్ ఎయిర్ బ్లూటూత్ ట్రాకర్.. స్పెసిఫికేషన్లు, ధర ఎంతంటే?