JioTag Air Tracker : భారతీయ యూజర్ల కోసం జియోట్యాగ్ ఎయిర్ బ్లూటూత్ ట్రాకర్.. స్పెసిఫికేషన్‌లు, ధర ఎంతంటే?

భారత మార్కెట్లో జియోట్యాగ్ ఎయిర్ జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలో ప్రారంభ ధర రూ. 1,499కు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ మొత్తం బ్లూ, గ్రే, రెడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

JioTag Air Tracker : భారతీయ యూజర్ల కోసం జియోట్యాగ్ ఎయిర్ బ్లూటూత్ ట్రాకర్.. స్పెసిఫికేషన్‌లు, ధర ఎంతంటే?

JioTag Air Bluetooth Tracker With Support ( Image Source : Google )

JioTag Air Tracker : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో బ్లూటూత్ ట్రాకర్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా భారత మార్కెట్లోకి జియోట్యాగ్ ఎయిర్ తీసుకొచ్చింది. ఈ డివైజ్ ముఖ్య కొత్త ఫీచర్లలో ఒకటిగా ఉంది. ఆపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్ ఫీచర్‌తో వస్తుంది. ఐఫోన్ వినియోగదారులకు కీ, సామాను, వాలెట్‌లు, పెంపుడు జంతువులు వంటి పోయిన లేదా దొంగిలించిన వస్తువులను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. కొన్నిసార్లు ఈ జియోట్యాగ్ తప్పుగా లొకేషన్ అందించే అవకాశం ఉంది. గత నెలలో జియోఫైనాన్స్ యాప్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ లేటెస్ట్ ప్రొడక్టుగా మారింది.

Read Also : Jio Tariff Charges : కొడుకు పెళ్లి ఖర్చు మాపై వేస్తున్నావా అంబానీ మావా.. జియో రీఛార్జ్ ధరల పెంపుపై భారీగా ట్రోల్స్..!

భారత్‌లో జియోట్యాగ్ ఎయిర్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో జియోట్యాగ్ ఎయిర్ జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలో ప్రారంభ ధర రూ. 1,499కు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ మొత్తం బ్లూ, గ్రే, రెడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. కొనుగోలుదారులు CredUPI, Paytm ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్ చేసి క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

జియోట్యాగ్ ఎయిర్ స్పెసిఫికేషన్లు :
జియోట్యాగ్ ఎయిర్ రెండు ట్రాకింగ్ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌లో జియోథింగ్స్ యాప్‌తో ఉపయోగించవచ్చు. అయితే, ఆపిల్ యూజర్లు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి ఫోన్లలో ఫైండ్ మై నెట్‌వర్క్ యాప్‌తో కలిసి ఉపయోగించవచ్చు. (JioThings) యాప్‌ని ఆపిల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా యాప్ స్టోర్ ద్వారా ఉపయోగించవచ్చు. అయితే, జియోట్యాగ్ ఎయిర్ ఒకేసారి ఒక యాప్‌ను మాత్రమే ఉపయోగించవచ్చు.

ఐఓఎస్ 14 లేదా ఆ తర్వాత వెర్షన్‌లో ఐఫోన్ మోడల్‌లకు ఆండ్రాయిడ్ 9, నెక్స్ట్ ఫర్మ్‌వేర్‌లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఈ జియో ట్రాకర్‌లో బ్లూటూత్ 5.3 అమర్చి ఉంటుంది. 90 నుంచి 120డీబీ పరిధిలో సౌండ్‌లను ప్లే చేయగల ఇంటర్నల్ స్పీకర్‌తో వస్తుంది.

కొలతలు పరంగా చూస్తే.. 38x38x7mm కలిగి ఉంది. 10గ్రాముల బరువు ఉంటుంది. బ్లూటూత్ ట్రాకర్ ఆపిల్ లాస్ట్ మోడ్‌కు సపోర్టు అందిస్తుంది. నెట్‌వర్క్‌లో ఫోన్ ఉన్నపుడు ఆపిల్ ఫోన్‌లో ఆటోమాటిక్‌‌గా నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి యూజర్లను అనుమతిస్తుంది. 12-నెలల బ్యాటరీతో వస్తుంది. అదనపు బ్యాటరీ, రిటైల్ బాక్స్‌లో జియోట్యాగ్ ఎయిర్‌తో లాన్యార్డ్ కూడా ఉంది.

Read Also : Jio 5G data Plans : జియో యూజర్లకు అలర్ట్.. ఇకపై అన్ని ప్లాన్లలో 5జీ డేటా రాదు.. ఎంత చెల్లించాలంటే?