Lava Blaze X 5G Launch : అదిరే ఫీచర్లతో లావా బ్లేజ్ X 5జీ ఫోన్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Lava Blaze X 5G Launch : లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్ 64ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Lava Blaze X 5G Launch : అదిరే ఫీచర్లతో లావా బ్లేజ్ X 5జీ ఫోన్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Lava Blaze X 5G With MediaTek Dimensity ( Image Source : Google )

Lava Blaze X 5G Launch : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా నుంచి లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా లావా బ్లేజ్ ఎక్స్ 5జీ వచ్చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే అమర్చారు. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీతో వస్తుందని గతంలో పుకారు వచ్చింది. లావా బ్లేజ్ ఎక్స్ 5జీ 64ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

భారత్‌లో లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ధర :
భారత మార్కెట్లో లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 14,999కు పొందవచ్చు. 128జీబీ స్టోరేజ్‌తో 6జీబీ, 8జీబీ వేరియంట్ల ధర వరుసగా రూ. 15,999, రూ. 16,999కు అందిస్తుంది. స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. జూలై 20 నుంచి లావా ఇ-స్టోర్, అమెజాన్ ద్వారా అమ్మకానికి వస్తుంది. పరిచయ ఆఫర్‌గా అన్ని వేరియంట్లపై లావా రూ. 1,000 తగ్గింపు అందిస్తోంది.

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో) సపోర్టు గల స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. 16జీబీ వరకు అదనపు ర్యామ్ ఆన్‌బోర్డ్ స్టోరేజీని ఉపయోగించే వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఫోన్‌లో అందుబాటులో ఉంది.

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్ 64ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. లావా బ్లేజ్ ఎక్స్ 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఓటీజీ, 5జీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ సహా సెన్సార్‌లతో ఐపీ52-రేటింగ్‌తో వస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్ 33డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించే 5,000mAh ఎల్ఐ-పొలిమర్ బ్యాటరీ ద్వారా సపోర్టు అందిస్తుంది.

Read Also : Vivo Y03t Launch : వివో నుంచి సరికొత్త Y03t ఫోన్, స్మార్ట్‌‌వాచ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?