iQoo Pad 2 Pro Launch : కొత్త ఐక్యూ ప్యాడ్ 2 ప్రో చూశారా? ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇలాంటి టాబ్లెట్ కొనాలి..!

iQoo Pad 2 Pro Launch : ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త వెర్షన్ ఆవిష్కరించింది. ఐక్యూ ప్యాడ్ 2ప్రో 3.1కె రిజల్యూషన్‌తో 13-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వై-ఫై7 కనెక్టివిటీని అందిస్తుంది.

iQoo Pad 2 Pro Launch : కొత్త ఐక్యూ ప్యాడ్ 2 ప్రో చూశారా? ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇలాంటి టాబ్లెట్ కొనాలి..!

iQoo Pad 2 Pro 16GB RAM, 1TB Storage Variant Launched ( Image Source : Google )

iQoo Pad 2 Pro Launch : కొత్త టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ బ్రాండ్ నుంచి సరికొత్త టాబ్లెట్ వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో ఐక్యూ ప్యాడ్ 2ప్రో మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లతో మేలో చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, వివో సబ్-బ్రాండ్ ఐక్యూ 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో కొత్త టాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Read Also : iQOO Z9x Launch : భారీ బ్యాటరీతో ఐక్యూ Z9x ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 12వేలు మాత్రమే!

ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త వెర్షన్ ఆవిష్కరించింది. ఐక్యూ ప్యాడ్ 2ప్రో 3.1కె రిజల్యూషన్‌తో 13-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వై-ఫై7 కనెక్టివిటీని అందిస్తుంది. 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 11,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

ఐక్యూ ప్యాడ్ 2 ప్రో ధర :
ఐక్యూ ప్యాడ్ 2ప్రో కొత్తగా లాంచ్ అయిన 16జీబీ ర్యామ్+ 1టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 4,599 (దాదాపు రూ. 52వేలు). ప్రస్తుతం చైనాలో బ్లూ టింగ్, గ్రే క్రిస్టల్, సిల్వర్ వింగ్ కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది. సెప్టెంబర్‌లోపు టాబ్లెట్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఐక్యూ స్మార్ట్ టచ్ కీబోర్డ్ 2ప్రో, ఐక్యూ పెన్సిల్ ఎయిర్‌పై సీఎన్‌వై 399 (దాదాపు రూ. 4,500) విలువైన ఐక్యూ స్టైలస్‌ను సీఎన్‌వై 300 (దాదాపు రూ. 3,400) వరకు తగ్గింపును పొందవచ్చు.

ఐక్యూ ప్యాడ్ 2 ప్రో మొదట్లో మేలో ప్రకటించింది. కొత్త వెర్షన్ 8జీబీ+ 256జీబీ, 12జీబీ + 256జీబీ ర్యామ్ 16జీబీ+ 512జీబీ వేరియంట్‌లతో పాటు సీఎన్‌వై 3,399 (దాదాపు రూ. 38వేలు), సీఎన్‌వై 3,699 (దాదాపు రూ. 41,590) ధరతో అందుబాటులో ఉంది.

ఐక్యూ ప్యాడ్ 2 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐక్యూ ప్యాడ్ 2ప్రో ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 4పై రన్ అవుతుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో 13-అంగుళాల 3.1కె (2,064×3,096 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ఎస్ఓసీతో రన్ అవుతుంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీని ఉంటుంది. 37,000 మి.మీ చదరపు హీట్ డిస్సిపేషన్ ఏరియాతో త్రీ-డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఐక్యూ ప్యాడ్ 2ప్రో 13ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్, సెల్ఫీలకు 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. టాబ్లెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్ కలర్ టెంపరేచర్ సెన్సార్, హాల్ సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి. అథెంటికేషన్ కోసం ఫేస్ రికగ్నైజేషన్ సపోర్టు ఇస్తుంది. ఈ టాబ్లెట్ ఎనిమిది స్పీకర్లతో వస్తుంది.

ఐక్యూ ప్యాడ్ 2ప్రో 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 11,500mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 14.8 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17.7 గంటల వరకు ఆఫ్‌లైన్ వ్యూ టైమ్, 10.8 గంటల వరకు వీడియో కాలింగ్ టైమ్ అందిస్తుంది. టాబ్లెట్ 289.56×198.32×6.64ఎమ్ఎమ్ కొలతలు, 679 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : iQoo Neo 9s Pro Plus : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?