TGPSC Group Exams : తెలంగాణలో గ్రూప్ 2, గ్రూపు 3 పరీక్షలు వాయిదా పడ్డాయా? టీజీపీఎస్సీ క్లారిటీ ఇదిగో!

TGPSC Group Exams : గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల రీషెడ్యూల్ తేదీలు ఇవేనంటూ ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన టీజీపీఎస్సీ అధికారులు ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.

TGPSC Group Exams : తెలంగాణలో గ్రూప్ 2, గ్రూపు 3 పరీక్షలు వాయిదా పడ్డాయా? టీజీపీఎస్సీ క్లారిటీ ఇదిగో!

TGPSC Gives Clarity on Telangana Group Exams Postponed ( Image Source : Google )

TGPSC Group Exams : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా డిమాండ్ వినిపిస్తోంది. గ్రూపు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వేలాది మంది అభ్యర్థులు ప్రిపరేషన్‌, పోస్టుల విషయంలో వాయిదా వేయాలని గతకొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యర్థుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుందనే ప్రచారం జోరుగా కొనసాగింది. అంతేకాదు.. పరీక్ష రీషెడ్యూల్ చేయాలనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని ఫేక్ వార్తలు గుప్పుమన్నాయి.

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఖండించిన టీజీపీఎస్సీ :
గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల రీషెడ్యూల్ తేదీలు ఇవేనంటూ ఒక ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన టీజీపీఎస్సీ అధికారులు ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ పోన్ అయ్యాయి అని వస్తున్న వార్తలను టీజీపీఎస్సీ తీవ్రంగా ఖండించింది.

గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ పోన్ అయిందని టీఎస్పీఎస్సీ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా వాస్తవమని, ఫేక్ న్యూస్ అంటూ టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. అలాంటి ఫేక్ వార్తలను గ్రూపు పరీక్ష అభ్యర్థులు అసలు నమ్మొద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని పలు సూచనలు చేసింది.

Read Also : Indian Bank Apprentice Posts : ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్.. 1500 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. పూర్తి వివరాలివే..!