CTET 2024 Exam : ఈ నెల 7నే సీటెట్ 2024 పరీక్ష.. త్వరలో అడ్మిట్ కార్డ్ విడుదల!

CTET 2024 Exam : ఈ నెల (జూలై) 7న సీటెట్ 2024 పరీక్ష జరుగనుంది. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ కోసం లింక్‌ను యాక్టివేట్ చేయనుంది.

CTET 2024 Exam : ఈ నెల 7నే సీటెట్ 2024 పరీక్ష.. త్వరలో అడ్మిట్ కార్డ్ విడుదల!

CTET 2024 Exam On July 7, Admit Card ( Image Source : Google )

CTET 2024 Exam : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల (జూలై) 7న సీటెట్ 2024 పరీక్ష జరుగనుంది. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ కోసం లింక్‌ను యాక్టివేట్ చేయనుంది. ఒకసారి అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : ITR Filing Made Easy : ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ తెలుసా? ఇ-ఫైలింగ్ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమంటే?

సీబీఎస్ఈ పరీక్ష జూలై 7, 2024న రెండు షిఫ్టులలో ఒక్కొక్కటి 2:30 గంటల పాటు జరుగనుంది. పేపర్ 2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది. పేపర్ 1 పరీక్ష.. 1 నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం, పేపర్ 2 పరీక్ష 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ ఇంతకుముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను కూడా రిలీజ్ చేసింది.

సీటెట్ 2024 దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 2లోని క్లాజ్ (n)లో పేర్కొన్న ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయునిగా నియామకం కోసం అర్హులైన అభ్యర్థులను పరీక్షించడం కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఎన్‌సీటీఈ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో అభ్యర్థి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.

Read Also : CBSE Class 12 Results 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 99.15 శాతం ఉత్తీర్ణతతో టాప్ 3లో తెలంగాణ!