Civils Prelims : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

యూపీఎస్సీ నేతృత్వంలో రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సెంటర్లకు ..

Civils Prelims : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

Civils Preliminary Exams

Civils Preliminary Exams : యూపీఎస్సీ నేతృత్వంలో రేపు (ఆదివారం) దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సెంటర్లకు 30 నిమిషాల ముందే వెళ్లాలి. ఆ తరువాత పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉండదు. పరీక్ష రాసేందుకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫొటో ఐడీ కార్డు తీసుకెళ్లాలి.