చంద్రబాబు అందుకే ఢిల్లీలో పర్యటించారు: కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు
Bhupathi Raju Srinivasa Varma: ఇచ్చిన డబ్బులు ఏమైనవో క్లారిటీ లేదని తెలిపారు. దీంతో తాము నిధులు ఇచ్చే పరిస్థితి లేదని..

Bhupathi Raju Srinivasa Varma
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ చైర్మన్ తో పాటు పలువురు అధికారులను కలిశారని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భూపతి రాజు శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఏపీలోని అన్ని సమస్యలు, ఇబ్బందులు గురించి వివరించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో కేంద్ర సర్కారు కేటాయించిన నిధులను ఇతర పనులకు డైవర్ట్ చేశారని చెప్పారు.
ఇచ్చిన డబ్బులు ఏమైనవో క్లారిటీ లేదని తెలిపారు. దీంతో తాము నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయా శాఖల కార్యదర్శులు చెప్పారని అన్నారు. తొమ్మిది శాఖల అధికారులతో సమావేశం అయితే అందరూ ఇదే చెప్పారని తెలిపారు. అమరావతిని త్వరితగతిన పూర్తిచేయాలనే చంద్రబాబు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు.
విభజన చట్టంలో ఉన్న కొన్ని అంశాలు ఇప్పటికీ పూర్తి కాలేదని, అందుకే తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించారని భూపతి రాజు శ్రీనివాస వర్మ చెప్పారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గతంలో కలిసి పనిచేశారని, ఇద్దరి మధ్య చక్కని సమన్వయం ఉందని తెలిపారు.
ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు..