Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!

Xiaomi SU7 Electric Car : భారత మార్కెట్‌లో షావోమి అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి అయిన తరుణంలో బెంగళూరులో ఈ SU7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనలో ఉంచారు. దేశీయ మార్కెట్లో షావోమీ ఈవీ కారుపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!

After Phones, Xiaomi Showcases SU7 Electric Car In India ( Image Source : Google )

Xiaomi SU7 Electric Car : భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి SUV ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ట్రెండ్ తగ్గట్టుగా కార్ల తయారీదారులు ఎలక్ట్రిక్ కార్లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వాహనదారులు కూడా ఈవీ కార్ల మోడల్స్‌పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. షావోమీ కూడా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Read Also : iQoo Pad 2 Pro Launch : కొత్త ఐక్యూ ప్యాడ్ 2 ప్రో చూశారా? ఫీచర్లు అదుర్స్.. కొంటే ఇలాంటి టాబ్లెట్ కొనాలి..!

త్వరలోనే ఆటోమొబైల్ రంగంలోకి అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎలక్ట్రిక్ కారు ఎంట్రీ ఇవ్వనుంది. అదే.. షావోమీ SU7 ఎలక్ట్రిక్ కారు.. ఇప్పటికే ఇదే పేరుతో చైనాలో లాంచ్ చేయగా.. ఇతర కార్ల కంపెనీలకు పోటీగా నిలిచింది. చైనా మార్కెట్లో ఈ SUV ఎలక్ట్రిక్ కారు మోడల్ ధర 2,15,900 యువాన్‌లు. మన భారత కరెన్సీలో రూ.25 లక్షలు అనమాట. భారత మార్కెట్‌లో షావోమి అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి అయిన తరుణంలో బెంగళూరులో ఈ SU7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనలో ఉంచారు. దేశీయ మార్కెట్లో షావోమీ ఈవీ కారుపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

షావోమీ SU7 ఎలక్ట్రిక్ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. 5 మీటర్ల పొడవు ఉంటుంది.. ప్రీమియం సెడాన్‌ లో-డ్యూయల్ మోటర్స్ కలిగి ఉంది. 101KWH బ్యాటరీతో తయారైన ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 800 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. లగ్జరీ ఎక్స్‌టీరియర్‌ కలిగిన ఈవీ కారుకు భారతీయ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేలా ఉంది. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Read Also : Honor MagicBook Art 14 : కొత్త హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 ల్యాప్‌టాప్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!