Mohammed Shami : టీమ్ఇండియాలో ష‌మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా..? బుమ్రా, సిరాజ్‌లు కానేకాదు..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా ఫైన‌ల్ చేరుకోవ‌డంలో పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు.

Mohammed Shami : టీమ్ఇండియాలో ష‌మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రో తెలుసా..? బుమ్రా, సిరాజ్‌లు కానేకాదు..

Pacer Shami Names Two Best Friends From Indian Team

Shami : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా ఫైన‌ల్ చేరుకోవ‌డంలో పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు. త‌న బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకుపుట్టించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కేవ‌లం ఏడు మ్యాచులు మాత్ర‌మే ఆడిన ష‌మీ 24 వికెట్లు తీశాడు. ఆ టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ప్ర‌పంచ‌క‌ప్‌ స‌మ‌యంలో చీల‌మండ‌ల గాయానికి గురి అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ గాయంతోనే అత‌డు మ్యాచులు ఆడాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన అనంత‌రం ఆట‌కు దూరంగా ఉన్నాడు. గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు.

బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్న ష‌మీ ఇటీవ‌ల నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఇంట‌ర్వ్యూలో ష‌మీ మాట్లాడుతూ.. టీమ్ఇండియా జ‌ట్టులో త‌న‌కు ఇద్ద‌రు బెస్ట్ ప్రెండ్స్‌ ఉన్నార‌ని చెప్పాడు. వారు మ‌రెవ‌రో కాదు.. విరాట్ కోహ్లీ, ఇషాంత్ శ‌ర్మ అని తెలిపాడు.

Gautam Gambhir : కోచ్‌గా తొలి మీడియా స‌మావేశం.. రోహిత్, కోహ్లీల‌ వ‌న్డే కెరీర్ గురించి గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు..

‘కోహ్లీ, ఇషాంత్ నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను గాయ‌ప‌డిన‌ప్పుడు, కోలుకుంటున్న స‌మ‌యంలో నాకు ఫోన్ చేసి నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకునే వారు.’ అని ష‌మీ తెలిపాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా అర్ష్‌దీప్ పై పాకిస్తాన్‌ మాజీ ఆట‌గాడు ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించాడు. కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్ రివ‌ర్స్ సింగ్ రాబ‌డుతున్నాడ‌ని, బాల్ టాంప‌రింగ్ చేసే అత‌డు ఈ విధంగా చేస్తున్నాడ‌ని, అంపైర్లు కాస్త క‌ళ్లు తెరిచి చూడాలని ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ ఆరోప‌ణ‌లు చేశాడు.

పాకిస్తాన్ ఆట‌గాళ్లు ఎల్ల‌ప్పుడూ త‌మ పై విషం గ‌క్కుతూనే ఉంటార‌ని ష‌మీ అన్నాడు. వాళ్లు ఎప్ప‌టికీ మార‌ర‌ని అన్నాడు. ఒకరేమో మాకు మ్యాచ్‌లో భిన్న‌మైన బంతి ఇచ్చార‌ని అంటార‌ని, ఇంకొక‌క‌రు బంతిలో చిప్‌ ఉంద‌ని చెబుతార‌న్నాడు. తాను బాల్ ను కోసి చూపిస్తాన‌ని, అందులో ప‌రిక‌రం ఉందో లేదో చూసి చెప్పాల‌న్నాడు. తన‌కు ఇంజ‌మామ్ అంటే ఎంతో గౌర‌వం అని, అయితే.. ఒక‌వేళ పాకిస్తాన్ ఆట‌గాళ్లు రివ‌ర్స్ స్వింగ్ రాబ‌డితే అత‌డు ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే వాడా అని ప్ర‌శ్నించాడు. ఓ బౌల‌ర్ బంతిని స్వింగ్‌, రివ‌ర్స్ స్వింగ్ చేస్తున్నాడు అంటే అది కేవలం అత‌డి నైపుణ్య‌మేన‌ని తెలిపాడు.

Ajit Agarkar : మ‌రో రెండేళ్లు సూర్య‌నే కెప్టెన్‌..! హార్దిక్‌, జ‌డేజా ప‌రిస్థితిపై అగార్క‌ర్‌ కీల‌క వ్యాఖ్య‌లు..