ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ

ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది.

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ

Nadendla Manohar clarity on Andhrapradesh Free Gas Cylinders Scheme 2024

Nadendla Manohar on Free Gas Cylinders Scheme : ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ”ఉచిత గ్యాలరీ గ్యాస్ సిలిండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా 361 మంది లబ్ధిదారులకు మొదట ఉచిత ఎల్పిజీ సిలిండర్లతో పాటు ఉచిత గ్యాస్ కలెక్షన్స్ రాష్ట్రంలో ఇస్తున్నామ”ని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు.

టెంపుల్ టూరిజంపై మంత్రి దుర్గేష్ స్పందన
టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ప్రత్యేక ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. ఆలయాలకు పర్యాటకుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజీలను పర్యాటక శాఖ నిర్వహిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో పర్యాటక రంగం నిస్తేజంగా తయారయిందని విమర్శించారు.

కింగ్ జార్జ్ హాస్పటల్‌లో 1562 పడకలు: ఆరోగ్య మంత్రి
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పటల్‌లో 1562 పడకలు ఉన్నాయని, డిమాండ్‌కు అనుగుణంగా అదనపు పడకలు కూడా ఇస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిబంధనల ప్రకారం తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారని 600 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు.

Also Read : ఏపీలో సంచలనం రేపిన మదనపల్లె ఘటనలో ట్విస్ట్..

నర్సింగ్ స్టాఫ్ తక్కువగా ఉన్నారు: బీజేపీ ఎమ్మెల్యే
కింగ్ జార్జ్ హాస్పటల్‌లో నర్సింగ్ స్టాఫ్ తక్కువగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఆరోగ్య మంత్రి కేజీహెచ్ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. నిబంధన ప్రకారం నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అంటున్నారు. కానీ పేషంట్స్‌కు సరిపడా నర్సింగ్ స్టాఫ్ లేరు. 616 మంది మాత్రమే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మినిమం రిక్వైర్మెంట్‌కి సరిపడా నర్సింగ్ స్టాఫ్ లేరని ఆయన వెల్లడించారు.