36 హత్యలు జరిగితే ఒక్కరినే‌ ఎందుకు పరామర్శించారు?: జగన్‌పై మంత్రి అనిత ఫైర్

జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. ప్రజలు కాదు కదా ఆయన కుటుంబసభ్యులు కూడా వినరు.

36 హత్యలు జరిగితే ఒక్కరినే‌ ఎందుకు పరామర్శించారు?: జగన్‌పై మంత్రి అనిత ఫైర్

Vangalapudi Anitha : ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. జగన్ ధర్నాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. జగన్ ధర్నా డ్రామా అని ఆమె అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకునేందుకు జగన్ ఇలా చేశారని మండిపడ్డారు.

”ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తుంది. కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. వైనాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటు. జగన్ కు.. రెడ్ బుక్ భయం పట్టుకుంది. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా, హుందాగా వ్యవహరించాలి.

బడ్జెట్ లో రూ.15 వేల కోట్లు ఏపీకి ఇచ్చినందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పాలి. జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో మీ హయాంలో జరిగినవి ఉన్నాయేమో చూసుకోవాలి. గతంలో అనంతబాబు హత్య చేసి డోర్ డెలవరీ చేస్తే.. అసెంబ్లీలో సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డులు పట్టుకోవడం సిగ్గుచేటు. మీ హయాంలో జరిగిన ఘటనలు ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టాలి కదా జగన్. అమరావతిలో మహిళా రైతులు ధర్నా లు చేస్తే ఆ ఫొటోలు పెట్టలేదే. గత ఐదేళ్లలో మీరు చేసిన ఘటనలు ఎగ్జిబిషన్ పెడితే ఢిల్లీ సగం సరిపోదు.

టీడీపీ కూటమి హయాంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చెప్పారు. హోంమంత్రిగా చెబుతున్నా ఇప్పటిదాకా నాలుగు హత్యలు జరిగాయి. అందులో ముగ్గురు టీడీపీ వాళ్లు చనిపోయారు. ఒకరు వైసీపీ. మిగతా 34 మంది హత్యల వివరాలు జగన్ చెప్పాలి. ఢిల్లీలో కాదు ఏపీలో ధర్నా పెడితే‌ మహిళలే జగన్ కు బుద్ధి చెబుతారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. ప్రజలు కాదు కదా ఆయన కుటుంబసభ్యులు కూడా వినరు. అసెంబ్లీని ఎగ్గొట్టాలనే జగన్ ఢిల్లీ వెళ్లి డ్రామా ఆడుతున్నారు. ఢిల్లీలో జగన్ ది సినిమా సెట్టింగే. జగన్ హయాంలో ఎన్ని జరిగాయో మా హయాంలో ఎన్ని జరిగాయో నిరూపించడానికి సిద్ధం.

Also Read : టీడీపీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశారా? ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ లైఫ్ ఇక క్లోజేనా?

శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలి. అధికారం పోయిన వెంటనే జగన్ కు ప్రత్యేక హోదా గుర్తుకొస్తుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడెందుకు అడగలేదు ప్రత్యేక హోదా జగన్. విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అంటున్నారు. వాళ్ల పేర్లు ఇవ్వండి. 36 రాజకీయ హత్యలు జరిగితే ఒక్కరినే‌ ఎందుకు పరామర్శించారు? జగన్ ది అంత డ్రామా” అని విరుచుకుపడ్డారు మంత్రి అనిత.