IND-W vs BAN-W : 10 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం..

దుంబుల్లా వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్లు సెమీ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి.

IND-W vs BAN-W : 10 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం..

IND-W vs BAN-W

టీమ్ఇండియా ఘ‌న విజ‌యం..
బంగ్లాదేశ్ నిర్దేశించిన 81 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 11 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. స్మృతి మంధాన (55 నాటౌట్‌; 39 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్‌) మెరుపు హాఫ్ సెంచ‌రీ సాధించ‌గా షెఫాలీ వ‌ర్మ (26 నాటౌట్‌; 28 బంతుల్లో 2 ఫోర్లు) రాణించింది. ఈ విజ‌యంతో భార‌త్ మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024 ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

ప‌వ‌ర్ ప్లే పూర్తి..
ల‌క్ష్య ఛేద‌న‌లో టీమ్ఇండియా ఓపెన‌ర్లు ధాటిగా ఆడుతున్నారు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 46 ప‌రుగులు చేసింది. షెఫాలీ వ‌ర్మ (17), స్మృతి మంధాన (28) ఆడుతున్నారు.

భార‌త టార్గెట్ 81
భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో బంగ్లాదేశ్ జ‌ట్టు స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 80 ప‌రుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ నిగ‌ర్ సుల్తానా (32), షోర్నా అక్టర్ (19 నాటౌట్‌)లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో రేణుకా సింగ్‌, రాధా యాద‌వ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. పూజా వ‌స్త్రాక‌ర్‌, దీప్తి శ‌ర్మ‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

రీతు మోని స్టంపౌట్‌..
దీప్తి శ‌ర్మ‌బౌలింగ్‌లో రీతు మోని (5) స్టంపౌట్‌గా వెనుదిరిగింది. దీంతో బంగ్లాదేశ్ 13.3వ ఓవ‌ర్‌లో 44 ప‌రుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయింది.

రబెయా ఖాన్ ఔట్‌..
భార‌త బౌల‌ర్ల ధాటికి బంగ్లాదేశ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. పూజా వ‌స్త్రాక‌ర్ బౌలింగ్‌లో షెఫాలీ వ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో రబెయా ఖాన్ (1) ఔటైంది. దీంతో 10.5వ ఓవ‌ర్‌లో 33 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ 5 వికెట్లు పొగొట్టుకుని క‌ష్టాల్లో ప‌డింది.

రుమానా అహ్మద్ క్లీన్‌బౌల్డ్‌..
రాధా యాద‌వ్ బౌలింగ్‌లో రుమానా అహ్మద్ (1) క్లీన్‌బౌల్డ్ అయింది. దీంతో బంగ్లాదేశ్‌ 9.1వ ఓవ‌ర్‌లో 30 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

ముర్షిదా ఖాతున్ ఔట్‌..
రేణుకా సింగ్ బౌలింగ్‌లో ష‌ఫాలీ వ‌ర్మ‌ క్యాచ్ అందుకోవ‌డంతో ముర్షిదా ఖాతున్ (4) ఔటైంది. దీంతో 4.5వ ఓవ‌ర్‌లో 21 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయింది.

ఇష్మా తంజిమ్ ఔట్‌..
బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఇష్మా తంజిమ్ (8) పెవిలియ‌న్‌కు చేరుకుంది. దీంతో 2.6వ ఓవ‌ర్‌లో 17 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది.

ఆదిలోనే షాక్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. రేణాసింగ్ బౌలింగ్‌లో ఉమా చెత్రీ క్యాచ్ అందుకోవ‌డంతో దిలారా అక్ట‌ర్ (6) ఔట్ అయ్యింది. దీంతో బంగ్లాదేశ్ 0.4 ఓవ‌ర్ల‌లో 7 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

బంగ్లాదేశ్ జ‌ట్టు..
దిలారా అక్టర్, ముర్షిదా ఖాతున్, నిగర్ సుల్తానా (కెప్టెన్‌), రుమానా అహ్మద్, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబెయా ఖాన్, షోర్నా అక్టర్, నహిదా అక్టర్, జహనారా ఆలం, మరుఫా అక్టర్

భార‌త జ‌ట్టు..
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ ఆడుతున్నారు.

టాస్‌..
శ్రీలంక వేదిక‌గా జరుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. దుంబుల్లా వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్లు సెమీ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.