Paris Olympics 2024 : అదరగొట్టిన విజయవాడ కుర్రాడు.. పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న భారత పురుషుల ఆర్చరీ జట్టు..
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు.

Dhiraj Bommadevara gets 4th seed mens team through to quarters
Paris Olympics : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. అధికారిక ఆరంభోత్సవం కంటే ఒక రోజు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండర్లలో భారత ఆర్చర్లు మెరిశారు. మహిళా ఆర్చరీ జట్టు టీమ్ ఈవెంట్‌లో భారత మహిళా ఆర్చర్లు నాలుగో స్థానం దక్కించుకుని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా తాజాగా పురుషుల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 2013 పాయింట్లతో ర్యాంకింగ్ రౌండ్‌లో భారత పురుషుల ఆర్చరీ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
22 ఏళ్ల తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. అతడు వ్యక్తిగత రౌండ్‌లో 681 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. 674 పాయింట్లు సాధించిన తరుణ్‌దీప్ రాయ్ 14వ స్థానం, 658 పాయింట్లతో ప్రవీణ్ జాదవ్ 39వ స్థానాల్లో నిలిచారు.
ఇక మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ సత్తా చాటింది. ధీరజ్, అంకిత భకత్ బరిలోకి దిగారు. అయిదో స్థానంలో నిలవడంతో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రౌండ్ ఆఫ్-16కు క్వాలిఫై అయ్యారు.
???????: ???’? ???? ????? – ?????’? ???? ?? ??? ?????:
➡️ Qualified directly for the QF, where they’ll face the winner of Colombia vs Turkey.
➡️ Potential Semis opponent: France
➡️ Potential Final opponent: South Korea #Archery… https://t.co/o2JNbt1UH9 pic.twitter.com/9yYI4U6uOM— India_AllSports (@India_AllSports) July 25, 2024