షాకింగ్.. శ్రీశైలం డ్యాం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కారు పార్క్ చేసి స్నానం చేస్తుండగా ఊహించని ఘటన

టూరిస్టులను తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ చెందిన వారిగా గుర్తించారు.

షాకింగ్.. శ్రీశైలం డ్యాం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కారు పార్క్ చేసి స్నానం చేస్తుండగా ఊహించని ఘటన

Srisailam Dam Incident : కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. పాతాళ గంగ వద్ద నీటిలో కారు చిక్కుకుంది. కొందరు టూరిస్టులు లింగాల గట్టు గంగ బ్రిడ్జి కింద కారు పార్క్ చేసి పాతాళ గంగలో స్నానం చేస్తున్నారు. సడెన్ గా డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో వరద నీరు కారుని ముంచెత్తింది. ఇది గమనించిన పర్యాటకులు స్థానికుల సాయంతో కారుని బయటకు తీశారు. పర్యాటకులు కూడా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

టూరిస్టులను తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ చెందిన వారిగా గుర్తించారు. దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ, ఈశ్వర్ సిద్ది గురుచరణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రమేశ్ పాతాళ గంగలో తమ కారుని పార్క్ చేసి స్నానం చేస్తుండగా సడెన్ గా వరద నీరు ముంచెత్తింది. హఠాత్తుగా డ్యామ్ 4వ గేటు తెరవడంతో నీటిమట్టం పెరిగి ఈ ఘటన జరిగింది. స్థానికులు అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చారు.

పర్యాటకులు కారులో ఉండగా వరద నీరు పోటెత్తింది. దాంతో కారు నీటిలో మునిగిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు అతి కష్టం మీద కారును, అందులోని పర్యాటకులను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. పదుల సంఖ్యలో అక్కడికి వచ్చిన స్థానికులు తమ చేతులతో కారుని ఒడ్డుకు లాక్కుని వచ్చారు. చివరికి అంతా సేఫ్ గా బయటపడటంతో అంతా రిలాక్స్ అయ్యారు. అయితే, నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. కాగా, శ్రీశైలం డ్యామ్ 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

శ్రీశైలం డ్యామ్ 7 గేట్లు ఎత్తివేత..
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో మరో రెండు గేట్లను ఓపెన్ చేశారు. ప్రస్తుతం 7 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న మూడు గేట్లను పైకి ఎత్తగా, ఇవాళ ఉదయం రెండు గేట్లను ఓపెన్ చేశారు. క్రమంగా వరద పెరుగుతుండటంతో మరో రెండు గేట్లను తెరిచారు అధికారులు. మొత్తం 7 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీళ్లను కిందకు విడుస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ కు 4 లక్షల 2వేల 960 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. లక్ష 96వేల 934 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో ఉంది.

Also Read : వయనాడ్‌లో జల విలయం.. 600 మంది వలస కార్మికులు గల్లంతు.. ఆచూకీపై ఆందోళన